Begin typing your search above and press return to search.

జాలేస్తోంది.. వారి నిజ స్వరూపం బయటపడుతుంది: జానీ మాస్టర్

దీంతో జానీ మాస్టర్ రెస్పాండ్ అయ్యారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తోందని తెలిపారు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 9:56 AM GMT
జాలేస్తోంది.. వారి నిజ స్వరూపం బయటపడుతుంది: జానీ మాస్టర్
X

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద వర్క్ చేసిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు వర్క్ తో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తాజాగా జానీ మాస్టర్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

జానీ మాస్టర్‌ పై తాము గెలిచామని నటి ఝాన్సీ రీసెంట్ గా పోస్ట్ చేశారు. జిల్లా కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారని ఆమె తెలిపారు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జానీ మాస్టర్ రెస్పాండ్ అయ్యారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తోందని తెలిపారు.

అన్ని విషయాల్లో నిజానిజాలు త్వరలోనే బయట పడతాయని అన్నారు. సొంత లాభం కోసం కోర్టు ఇచ్చిన ఆర్డర్లపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను చూస్తే జాలి వేస్తుందని వ్యాఖ్యానించారు. తనకు తెలియకుండా జరిగిన యూనియన్‌ ప్రెసిడెంట్ ఎన్నికలపై పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో లింక్ చేసి పోస్టులు పెడుతున్నారని తెలిపారు.

అయితే మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటున్నారేమోనని అన్నారు. కానీ జడ్జిమెంట్ వచ్చాక.. ఎవరి నిజ స్వరూపం ఏంటో తెలుస్తుందని తెలిపారు. అప్పుడు దేని కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుందని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని, న్యాయమే గెలుస్తుందని రాసుకొచ్చారు. నిజం అందరికీ తెలుస్తుందని జానీ మాస్టర్ పేర్కొన్నారు.

ఇక లైంగిక వేధింపుల ఆరోపణలతో గత ఏడాది జానీ అరెస్ట్ అవ్వడంతో ఆయనను డ్యాన్స్‌ యూనియన్‌ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు గతంలో టాక్ వినిపించింది. దానిపై అప్పట్లో ఆయన ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. నిర్దరణ కాని ఆరోపణలను కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

తన పదవీ కాలం ఇంకా చాలా ఉందని చెప్పారు. అదే సమయంలో అనైతికంగా ఎన్నికలు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు తీసుకునే రైట్స్ ఎవరికీ లేవని క్లారిటీ ఇచ్చారు. దానిపై తాను చట్టపరంగా పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని విషయాలు త్వరలో బయట పడతాయని చెప్పారు. టాలెంట్ ఉన్న ఎవరికైనా పని దొరకకుండా ఎవరూ కూడా ఆపలేరని తెలిపారు. మరి జానీ మాస్టర్ పోస్ట్ తర్వాత ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.