Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ భార్య.. ఏం జరుగుతోంది?

అందులో భాగంగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను గురువారం ఉదయం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 10:20 AM GMT
పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ భార్య.. ఏం జరుగుతోంది?
X

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయం ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మైనర్ గా ఉన్న టైమ్ లో కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు.. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అందులో భాగంగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను గురువారం ఉదయం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకువస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా.. నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అప్పుడు ఆమెతో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తనకు ఫేక్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే వచ్చానని చెప్పింది.

అయితే మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌.. జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు రావడం చర్చనీయాంశంగా మారింది. సుమలత అలియాస్ ఆయేషా.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మరాయి.

మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ (21) ఆదివారం.. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ కేసును నార్సింగి స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడి పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు పరిశీలించారు. సంబంధిత అభియోగాలు మోపి.. విచారణ ప్రారంభించారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను తాజాగా గోవాలోని ఓ లాడ్జిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే టాలీవుడ్‌ లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీని తాత్కాలికంగా తప్పించాలని కమిటీ సిఫార్సు చేసింది. వర్కింగ్ ప్లేస్ లో మహిళలకు సినీ ఇండస్ట్రీ ధైర్యాన్ని ఇవ్వలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని కమిటీ ఛైర్‌ పర్సన్ ఝాన్సీ కోరారు. మరి జానీ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.