స్టార్ కిడ్స్ ని డైరెక్ట్ చేయబోతున్న స్టార్ హీరో కొడుకు?
జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందనున్న తొలి సినిమాలో ధృవ్ విక్రమ్, అదితి శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 1 Aug 2024 9:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో జేసన్ తన డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా ఈ చిత్రంలో నటించే హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందనున్న తొలి సినిమాలో ధృవ్ విక్రమ్, అదితి శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలానే ఈ మూవీతో సింగర్ ఏఆర్ అమీన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, నలుగురు స్టార్ కిడ్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతుండటం సినీ అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు నేపో కిడ్స్ అంటూ ట్రోల్ చేయడానికి అవకాశం కల్పించింది.
తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ అనే సంగతి తెలిసిందే. తండ్రి బాటలో చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మావెరిక్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి కూడా హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కొడుకే ఏఆర్ అమీన్. ఇప్పటికే సింగర్ గా సినిమాల్లో పాటలు పాడుతున్నాడు. కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసాడు.
ఇప్పుడు జేసన్ డైరెక్ట్ చేయబోయే రొమాంటిక్ లవ్ స్టోరీలో ధృవ్, అదితి, అమీన్ ముగ్గురూ భాగం అవుతారని ఊహాగాలు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా మంచి స్నేహితులని, అందుకే ఈ వార్తలు వస్తున్నాయని అంటున్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా కలిసి సినిమా చేస్తారేమో కానీ, లైకా ప్రాజెక్ట్ లో మాత్రం కాదనే మరో మాట కూడా వినిపిస్తోంది. ఈ నెల 26న జాసన్ సంజయ్ తన 24వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అతని డెబ్యూ మూవీకి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
విజయ్ జోసెఫ్ పెద్ద కొడుకైన జేసన్ సంజయ్, 'వెట్టైక్కారన్' చిత్రంలో తన తండ్రితో కలిసి 'నాన్ అడిచా' పాటలో కనిపించాడు. దీంతో హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. 'ఉప్పెన' తమిళ రీమేక్ తో హీరోగా లాంచ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ జాసన్ మాత్రం యాక్టింగ్ కంటే డైరెక్షన్ పైనే ఆసక్తిని పెంచుకున్నాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తి చేయడంతో పాటుగా లండన్ లో స్క్రీన్ రైటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసాడు. 'సిరి' అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలో లైకా లాంటి పెద్ద బ్యానర్ లో డైరెక్టర్ గా లఇంట్రడ్యూస్ కాబోతున్నాడు.