Begin typing your search above and press return to search.

జాన్వీ 150 రోజులు పైగా క్రికెట్ ప్రాక్టీస్!

రాజ్‌కుమార్ రావ్ తో `మిస్టర్ అండ్ మిసెస్ మహి`లో జాన్వీ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 May 2024 10:33 AM GMT
జాన్వీ 150 రోజులు పైగా క్రికెట్ ప్రాక్టీస్!
X

అందం ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ సూత్రాల్ని అనుస‌రించ‌డం రొటీనే కానీ.. తాను న‌టించే సినిమా కోసం ఏకంగా 150 రోజులుపైగా నెట్స్ లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోవ‌డం ఏ న‌టికైనా సాధ్య‌మ‌య్యే ప‌నేనా? కానీ దానిని సాధ్యం చేసి చూపించింది జాన్వీ క‌పూర్. ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్ గా ప‌ర్ఫెక్ష‌న్ కోసం అద్భుత‌మైన ఆట తీరు కోసం జాన్వీ చాలా శ్ర‌మించింది. నైపుణ్యం, ఖచ్చితత్వం మాత్రమే కాకుండా ఇంటెన్సివ్ స్ట్రెంగ్త్, స్టామినా కూడా అవసరమయ్యే సినిమా కోసం జాన్వీ కపూర్ అన్నివిధాలా ప్ర‌య‌త్నించింది.


రాజ్‌కుమార్ రావ్ తో `మిస్టర్ అండ్ మిసెస్ మహి`లో జాన్వీ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌థాంశం క్రికెట్ నేప‌థ్యంలో సాగుతుంది. తన సామర్థ్యం మేరకు ఆట‌ను నేర్చుకోవడమే కాకుండా తన శరీరానికి శిక్షణ కూడా ఇచ్చింది జాన్వీ. ఫిట్‌నెస్ ప‌రంగా ఏదీ త‌న‌కు కొత్తేమీ కాదు. జిమ్, పైలేట్స్ స్టూడియోలో రెగ్యులర్ వ్యాయామాలు చేస్తుంది. యోగా ధ్యానం కొత్తేమీ కాదు. కానీ సినిమా కోసం ప్రత్యేకంగా క్రికెట్ నేర్చుకోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.


జాన్వీ ఒక క్రీడాకార‌ణిగా మారేందుకు 150 రోజులకు పైగా శిక్షణ పొందింది. ఇదే విష‌యాన్ని జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ రీల్ లో వెల్లడించింది. గాయాలు ఉన్నప్పటికీ జాన్వీ కపూర్ వైఖరి, లక్ష్యం ఒక ప్రొఫెషనల్ క్రీడాకారిణిని త‌ల‌పించాయి. క్రికెట్ అనేది శరీరానికే కాకుండా మనస్సుకు సంబంధించిన క్రీడ. పూర్తి ఏకాగ్రతతో జాన్వీ కపూర్ పిచ్-పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ లాగా ఆడటం ఒక వీడియోలో క‌నిపించింది.

బ‌లం కోసం చురుకుదనం కోసం పైలేట్స్ శిక్షణా సెషన్‌లకు హాజ‌ర‌వుతుంది జాన్వీ. పాపుల‌ర్ ఫిట్‌నెస్ కోచ్ సహాయంతో జాన్వీ కపూర్ దాదాపు ఆరు సంవత్సరాలుగా పైలేట్స్ ప్రాక్టీస్‌ను పూర్తి చేసింది. కోచ్ నమ్రతా పురోహిత్ షేర్ చేసిన తాజా పోస్ట్‌లో జాన్వి క‌పూర్ వ‌ర్క‌వుట్లు చేస్తూ సీరియ‌స్ గా క‌నిపించింది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ `మిస్టర్ అండ్ మిసెస్ మహి` బాక్సాఫీస్ పిచ్‌పై సిక్సర్‌లను బాద‌డ‌మే ఇప్పుడు మిగిలి ఉంది.

మామ్ న‌మ్మ‌కాల‌ను ఫాలో అవుతున్నా:

తాజా ఇంట‌ర్వ్యూలో జాన్వీ తాను తిరుప‌తికి ఎందుకు వెళుతుందో కూడా వెల్ల‌డించింది. నిజానికి మామ్ శ్రీ‌దేవి మ‌ర‌ణం త‌ర్వాత తాను చాలా మారాన‌ని, త‌న త‌ల్లి ఇష్ట దైవ‌మైన తిరుమ‌లేశుని సంద‌ర్భ‌నానికి వెళ్ల‌డానికి కార‌ణం ఇదేన‌ని కూడా తెలిపింది. త‌న త‌ల్లి గారైన శ్రీ‌దేవికి కొన్ని న‌మ్మ‌కాలు ఉండేవి. వాటిని ఇప్పుడు తాను కూడా న‌మ్ముతున్నాన‌ని వెల్ల‌డించింది. త‌న పిన్ని గారైన మ‌హేశ్వ‌రితో క‌లిసి జాన్వీ క‌పూర్ త‌ర‌చుగా తిరుమ‌లేశుని సంద‌ర్శిస్తోంది. చెన్నైలో ఉన్న‌ శ్రీ‌దేవి ఇంటిని ఇటీవ‌ల రీమోడిఫికేష‌న్ చేసారు. ఈ స్వ‌గృహానికి నిరంత‌రం జాన్వీ వెళుతుంటుంది. అదే స‌మ‌యంలో తిరుమ‌లేశుని సంద‌ర్శ‌నానికి వెళుతుంటుంది. తాజాగా త‌మిళ‌నాడులోని ముప్ప‌త‌మ్మ‌న్ అనే ప్ర‌ఖ్యాత టెంపుల్ కి మ‌హేశ్వ‌రితో క‌లిసి సంద‌ర్శించింది జాన్వీ.