ఎమోషన్ తోనే జపాన్ లో టాలీవుడ్ హవా!
తెలుగు సినిమాకి జపాన్ మార్కెట్
By: Tupaki Desk | 15 July 2023 9:19 AM GMTతెలుగు సినిమాకి జపాన్ మార్కెట్ కీలకంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన 'బాహుబలి'.. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాలు అక్కడా మంచి వసూళ్లు సాధించాయి. జపాన్ అభిమానులు తెలుగు హీరోల సినిమాల్ని ప్రత్యేకంగా ఆదరించడంతో! స్టార్లు అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తే జసాన్ మార్కెట్ ని సైతం టార్గెట్ చేస్తున్నారు. జపాన్ అభిమానుల ఎమోషన్ ని సైతం తెలుగు సినిమాలు ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయి.
'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ కారణం ఆరకమైన ఎమోషన్ అన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని రామ్ చరణ్ నటించని రంగస్థలం చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్ చేసారు.
ఇదే రోజున ఈ సినిమాకి పోటీగా కన్నడ కేజీఎఫ్ రెండు చిత్రాలు కూడా రిలీజ్ చేసారు. అయితే కేజీఎఫ్ కన్నా జపాన్ అభిమానులు రంగస్థలం ఎమోషన్ కే కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అయినా చిట్టి బాబు ఎమెషన్ కే ప్రేక్షకులు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు వసూళ్ల పరంగా కేజీఎఫ్ మేకర్స్ 'ఆర్ ఆర్ ఆర్' ని క్రాస్ చేసిన చిత్రంగా ప్రమోట్ చేసుకున్న ప్పటికీ అదెక్కడా వర్కౌట్ అవ్వలేదు. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పెర్పార్మెన్స్ ముందు యశ్ భారీ పోరాటం నిలబడలేదు.
వసూళ్ల పరంగా ఏ సినిమా ఎంత సాధించింది అన్న లెక్కలు లేవు గానీ....రంగస్థలం అప్పర్ హ్యాండ్ లో కనిపిస్తోంది. ఆరకంగా మరోసారి తెలుగు సినిమా జపాన్ లో సత్తా చాటిందని చెప్పొచ్చు.
భవిష్యత్ లో తెలుగు సినిమాకి అతిపెద్ద మార్కెట్ గా జపాన్ అవతరించబోతుందని భావిస్తున్నారు. పాన్ ఇండియాలో రిలీజ్ సక్సెస్ అయిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక జపాన్ లో ఆన్లైన్ పైరసీ ఉండదు. ఓటిటి కంటెంట్ మీద కఠిన నిబంధనలు.. పర్యవేక్షణ ఉంటాయి. కాబట్టి థియేటర్ ..అధికారిక డిజిటల్ పార్ట్ నర్ ద్వారానే సినిమాలు చూడటానికి అవకాశం ఉంది.