Begin typing your search above and press return to search.

టచింగ్ టచింగ్… ఇది జపాన్ సౌండ్!

కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:48 AM GMT
టచింగ్ టచింగ్… ఇది జపాన్ సౌండ్!
X

కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సునీల్ కూడా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఇంటరెస్టింగ్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. భాస్కరపట్ల రాసిన టచింగ్ టచింగ్ అంటూ సాగే ఈ సాంగ్ ని ఇంద్రావతి చౌహాన్ తో కలిపి కార్తి పాడటం విశేషం. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ గా ఈ సాంగ్ ఉంది. ఊ అంటావా తర్వాత ఇంద్రావతి వాయిస్ చాలా సాంగ్స్ వచ్చాయి. అయితే మరోసారి ఆమె గొంతుని జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్ళేలా ఈ సాంగ్ ఉండటం విశేషం.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒకే ఒక జీవితం తర్వాత ఈ బ్యానర్ నుంచి రాబోతున్న మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ జపాన్ కావడం విశేషం. కరుడుగట్టిన దొంగగా ఈ చిత్రంలో కార్తి పాత్ర ఉండబోతోంది. ట్రైలర్ తో కార్తి తన క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది అనేది క్లారిటీ ఇచ్చేశారు. కామెడీ యాక్షన్ జోనర్ లో ఈ కథని దర్శకుడు రాజు మురుగన్ చెబుతున్నారు.

కార్తి కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై తెలుగు నాట కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సర్దార్ తర్వాత అతని నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడం, అది కూడా కార్తి స్టైల్ ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత మూవీలో ఉండటంతో కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. డ్రీమ్ వారియర్ నుంచి చివరిగా వచ్చిన ఒకే ఒక జీవితం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మరో సూపర్ హిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా రొమాంటిక్ డ్యూయెట్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు యుట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.