టీజర్ టాక్.. ఈ మోస్ట్ వాంటెడ్ 'జపాన్' ఎవరు?
ఇక ఇప్పుడు అఫీషియల్ టీజర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్లోనే హీరో క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతుంది అని గోల్డ్ కు దాసోహం అనేలా.. అనుభవించు రాజా.. అనే తరహాలో కనిపిస్తాడని చూపించారు.
By: Tupaki Desk | 18 Oct 2023 12:57 PM GMTతమిళ హీరో కార్తీ సక్సెస్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలతో కొత్తగా ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే కమర్షియల్ ఫార్మాట్లో కూడా వీలైనంతవరకు వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు. ఇక అతని నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా జపాన్. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జపాన్ ను నవంబర్లో దీపావళి సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై కొంత విభిన్నంగా హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు అఫీషియల్ టీజర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్లోనే హీరో క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతుంది అని గోల్డ్ కు దాసోహం అనేలా.. అనుభవించు రాజా.. అనే తరహాలో కనిపిస్తాడని చూపించారు.
అయితే ఇప్పుడు విడుదల చేసిన టీజర్ లో అతను ఒక నేషనల్ లెవెల్ దొంగగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. సిటీలోని షాపులో రెండు వందల కోట్ల విలువైన నగలను ఎత్తుకుపోయిన దొంగ ఎవరు అనే పాయింట్ తో టీజర్ మొదలైంది. ఇక నాలుగు రాష్ట్రాల పోలీసులందరినీ కూడా అతను ముప్పు తిప్పలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులు అతని కోసం కసిగా రీసెర్చ్ చేస్తున్నట్లుగా చూపించారు.
అందులో కమెడియన్ సునీల్ కూడా చాలా సీరియస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతీ దొంగతనం స్టైల్ చూస్తూ ఉంటే జపాన్ చేసిన తరహాలో ఉంది అని, అతని పైన దేశ వ్యాప్తంగా 182 కేసులు ఉన్నట్లుగా చెప్పారు. ఇక అరాచకమైన ఒక సంఘటనతో జపాన్ మరింత టార్గెట్గా మారుతాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఏ విధమైన ప్రణాళికలు రచించారు అనేది సినిమాలో హైలైట్ కానుంది.
జపాన్ దొంగతనాలు చేసిన తర్వాత అమ్మాయిలు తో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇక జపాన్ రేంజ్ వేరు అంటూ అతను ఎక్కువగా గోల్డ్ తో కనెక్ట్ అయ్యేలా చూపించారు. కార్తీ కళ్ళజోడు నుంచి నోటిలో పన్ను వరకు కూడా గోల్డ్ తోనే ఉంటుంది అని అర్థమవుతుంది. అసలు జపాన్ గోల్డ్ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు.
అసలు పోలీసులు అతన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు. అతని వెనుకున్న మిస్టరీ ఏమిటి అనే పాయింట్ సినిమాలో హైలెట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇక జపాన్ ను పోలీసులు ఫైనల్ టార్గెట్ చేయడంతో మీరు ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ ను ఎవరు ఏమి పీకలేరు అని చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ అయింది. మరి టీజర్ లో ఉన్న హడావిడి వెండితెరపై ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.