Begin typing your search above and press return to search.

ఓకే రోజు రెండు అరవ సినిమాల కొట్లాట..!

వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమాల రిలీజ్ ల సందడి ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తాయి.

By:  Tupaki Desk   |   5 Nov 2023 8:31 AM GMT
ఓకే రోజు రెండు అరవ సినిమాల కొట్లాట..!
X

వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమాల రిలీజ్ ల సందడి ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేస్తాయి. స్టార్ సినిమాలు లేని టైం లో మీడియం, లో బడ్జెట్ సినిమాలు రిలీజ్ లు జరుగుతుంటాయి. తెలుగు మార్కెట్ మీద తమిళ సినిమాల హవా తెలిసిందే. కొద్దిగా క్రేజ్ ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంటాయి. రాబోయే వారం నవంబర్ 10న రెండు తమిళ సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధంగా ఉన్నాయి. తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ లో రాజ్ మురుగన్ డైరెక్షన్ లో జపాన్ సినిమా శుక్రవారం రిలీజ్ కు రెడీ అయ్యింది.

దీనికి పోటీగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమా కూడా వస్తుంది. జిగర్ తండా సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా ఆ సినిమాను తెలుగులో గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ నటించాడు. అయితే జిగర్ తండా డబుల్ ఎక్స్ అంటూ ఆ సినిమాకు సీక్వెల్ గా ప్లాన్ చేశారు.

జిగర్ తండా సీక్వెల్ కి ఫస్ట్ పార్ట్ కి కథ పరంగా ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. లారెన్స్ లీడ్ రోల్ లో ఎస్.జె సూర్య విలన్ గా ఈ సినిమా వస్తుంది. ఈ శుక్రవారం కార్తీ జపాన్ కి పోటీగా జిగర్ తండా 2 కూడా వస్తుంది. ఈ రెండు తమిళ సినిమాలు దీపావళికి తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలని తెలుగులో భారీ రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో ఆల్రెడీ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. జపాన్ టీజర్, ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి కాబట్టి కార్తీ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

కార్తీక్ సుబ్బరాజు ఫ్యాన్స్ కూడా తెలుగులో ఉన్నారు. లారెన్స్ సినిమాలను ఇష్టపడే వారు కూడా జిగర్ తండా 2 చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్ ఎలాగు తెలుగు సినిమాలేవి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి రెండు అరవ సినిమాలకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాల్లో ఏ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. రెండు సినిమాలను తెలుగులో బాగా ప్రమోట్ చేస్తున్నారు. జపాన్ సినిమాను తెలుగులో నాగార్జుంబ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు