Begin typing your search above and press return to search.

ఇండియన్ 2లో గేమ్ ఛేంజర్.. ఇది గమనించారా?

కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది

By:  Tupaki Desk   |   12 July 2024 6:05 AM GMT
ఇండియన్ 2లో గేమ్ ఛేంజర్.. ఇది గమనించారా?
X

కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి పర్వాలేదనే టాక్ ని సొంతం చేసుకుంది. ఇండియన్ మూవీకి సీక్వెల్ గా 28 ఏళ్ళ తర్వాత ఈ సినిమా రావడం విశేషం. కమల్ హాసన్ సేనాపతి పాత్రలో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశారు. తమిళ్ ఆడియన్స్ నుంచి అయితే ఇండియన్ 2 సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజులు గడిస్తే కానీ మూవీ అసలు రిజల్ట్ ఏంటనేది చెప్పలేం.

ఇదిలా ఉంటే శంకర్ ఇండియన్ 2 మూవీ చేస్తూనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ తెరకెక్కించారు. దిల్ రాజు 200+ కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబందించిన సీక్వెన్స్ షూట్ కంప్లీట్ అయిపోయిందంట. మరో 15 రోజులు గేమ్ చేంజర్ షూటింగ్ ఉందంట. ఇది ఫినిష్ చేస్తే సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. జరగండి జరగండి అంటూ సాగే డ్యూయెట్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది సాంగ్ ని ట్రోల్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎప్పటిలాగే కాపీ ట్యూన్ అనే ప్రచారం నడిచింది. ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో నడుస్తోంది.

ఇందులో ఓ సన్నివేశంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉండగా బస్సు కండెక్టర్ లేవండి… లేవండి… లేవండి అంటూ పాసింజర్స్ ని నిద్ర లేపుతాడు. ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసి గేమ్ చేంజర్ సాంగ్ కి కోసం శంకర్ ఇదే రిఫరెన్స్ తీసుకున్నారంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. జరగండి… జరగండి సాంగ్ ట్యూన్ ఇండియన్ 2లో ఆ సీన్ దగ్గర ప్లే అయ్యే సాంగ్ ట్యూన్ ఒకే విధంగా ఉండటంతో కంపారిజన్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

దీనిపై కొందరు నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. మూవీ రిలీజ్ రోజే ఇలా వీడియోలు షూట్ చేసి సోషల్ మీడియాలో ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. శంకర్ విజన్ ని తక్కువ అంచనా వేయొద్దని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఆలోచన, ఇమాజినేషన్ చాలా అడ్వాన్స్ గా ఉంటుందని అంటున్నారు.