Begin typing your search above and press return to search.

గాల్లో ఆమె ముద్దులపైనే స్టేడియంలో క‌ళ్ల‌న్నీ

ఓవైపు అత‌డు బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. దాయాది దేశానికి చెందిన ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మ‌న్ కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 4:59 PM GMT
గాల్లో ఆమె ముద్దులపైనే స్టేడియంలో క‌ళ్ల‌న్నీ
X

ఓవైపు అత‌డు బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. దాయాది దేశానికి చెందిన ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మ‌న్ కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. ఆరంభ‌మే కీల‌క వికెట్ తీసాడు. 8 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 40 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ స‌మ‌యంలో అత‌డి బౌలింగ్ యాక్ష‌న్ మాత్ర‌మే కాదు.. అత‌డి సంయ‌మ‌నం, స్టైల్ స్టేట్ మెంట్, యాక్స‌స‌రీస్ వ‌గైరా క్రికెట్ ప్రియుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించాయి. అయితే అదే ఆడియెన్ నుంచి ఒక అంద‌మైన‌ యువ‌తి ఫ్లైయింగ్ కిస్సులు, త‌థేకంగా ఎదురు చూపులు అంద‌రి మ‌న‌సుల్ని దోచాయి.

బంతి బంతికి ఆమె గాల్లో కిస్సులు వ‌దిలింది. ఆ ప‌వ‌నాలు మైదానంలో ఆట‌గాడిని తాకుతూనే ఉన్నాయి. ల‌వ్ గేమ్ ఒక‌వైపు.. ఆట ఇంకోవైపు..! అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. దుబాయ్‌లో జరిగిన ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా ఆట స్థ‌లంలో మెలో డ్రామా ఇది. ఈ ఎపిసోడ్ లో ఆట‌గాడు హార్థిక్ పాండ్యా. అత‌డిపైకి గాల్లో ముద్దులు విసిరింది మ‌రెవ‌రో కాదు.. జాస్మిన్ వాలియా. మైదానంలో ఆమె ప్ర‌తి యాక్ట్ ని స్క్రీన్ పై చూసిన ఆడియెన్ మైమ‌మ‌రిచిపోయారు. ఆట‌ను చిత్రీక‌రించే కెమెరా క‌ళ్లు జాస్మిన్ పైనే వాలిపోయేవి. అదిరిపోయే వైట్ డ్రెస్, కాంబినేష‌న్ షేడ్స్ ధ‌రించిన జాస్మిన్ వాలియా స్ట‌న్న‌ర్ గా క‌నిపించింది.

ఆమె ప్ర‌ముఖ‌ బ్రిటీష్ గాయ‌ని. బాలీవుడ్ లో పాట‌లు పాడింది. అక్క‌డే హార్థిక్ తో క‌నెక్ష‌న్ ఏర్ప‌డింది. జాస్మిన్ స్టేడియంలోని స్టాండ్స్ లో నిలుచుని ఉత్సాహంగా నినాదాలు చేస్తూ హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. ఇండియా- పాక్ మ్యాచ్ ని త‌నివి తీరా ఆస్వాధిస్తూ ఈ విదేశీ బ్యూటీ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. జాస్మిన్ - హార్థిక్ మ‌ధ్య సంబంధం గురించి కొంత‌కాలంగా పుకార్లు ఉన్నాయి. గ‌త ఏడాది ఆగ‌స్టులో ఈ ఇద్ద‌రూ గ్రీస్ లో ప్రేమ విహార‌యాత్ర‌కు వెళ్లార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ వారి బంధం గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ లేదు.

ప్ర‌స్తుతానికి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే. అత‌డు ఆటాడే చోట ఆమె ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఏదో జ‌రుగుతోంద‌నే ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి. కొన్నిటికి కాల‌మే సమాధానం ఇస్తుంది. అంత‌వ‌ర‌కూ ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.