Begin typing your search above and press return to search.

లైగర్+V+శాకుంతలం..'జటాయు' జాగ్రత్త రాజుగారు!

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం

By:  Tupaki Desk   |   25 July 2023 1:53 PM GMT
లైగర్+V+శాకుంతలం..జటాయు జాగ్రత్త రాజుగారు!
X

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతోనే మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా రానున్నాడు. ఇప్పటికే లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టం పరీక్షించుకున్నారు.

అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ విజయ్ దేవరకొండకి మాత్రం నార్త్ లో మంచి క్రేజ్ ఉందనే విషయాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తాను చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండని తీసుకోవాలని అనుకుంటున్నారు. చాలా నెలల క్రితమే జటాయు అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందని కూడా చెప్పారు. దిల్ రాజుకి వి లాంటి డిజాస్టర్ ని ఇంద్రగంటి ఇచ్చారు. అలాగే చివరిగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో మరో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు ఫ్లాప్ ల తర్వాత కూడా జటాయు మూవీని దిల్ రాజు ఇంద్రగంటి చేతిలోనే పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందంట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లోనే పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా జటాయు స్టోరీని విజయ్ దేవరకొండకి వినిపించడం జరిగిందంట. రౌడీ హీరోకి కథ బాగా నచ్చేయడంతో పాటు ఇప్పటి వరకు టచ్ చేయని యాక్షన్ బ్యాక్ డ్రాప్ పీరియాడికల్ ఫిక్షన్ స్టోరీ కావడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

ఇప్పటికే శాకుంతలం సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ కథలని సరిగ్గా డీల్ చేయకపోతే ఎలాంటి నష్టం వస్తుందనేది దిల్ రాజు టేస్ట్ చేశారు. దీంతో నెక్స్ట్ చేయబోయే జటాయు విషయంలో అలాంటి పొరపాట్లు లేకుండా పెర్ఫెక్ట్ ప్లాన్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నారంట. బడ్జెట్ పరిమితులు పెట్టుకోకుండా కంటెంట్ డిమాండ్ బట్టి ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఈ ఏడాది ఆఖరులో మూవీకి సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.