హిట్ మూవీకి సీక్వెల్.. ఎందుకు లేటవుతోంది?
దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పుడే అన్నారు తప్పించి దాని గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు.
By: Tupaki Desk | 18 March 2025 2:00 PM ISTప్రస్తుతమున్న ట్రెండ్ లో ఇండియన్ సినిమాలో సీక్వెన్సులు, ఫ్రాంచైజ్ సినిమాలు ఎక్కువైపోయాయి. టాలీవుడ్ లో కూడా ఈ సీక్వెన్సుల సందడి ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి భారీ హిట్ గా నిలిచిన ఓ సినిమాకు మాత్రం సీక్వెల్ అనుకుంటున్నారు కానీ అది కార్యరూపం మాత్రం దాల్చడం లేదు.
ఆ సినిమా మరేదో కాదు. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన జాతి రత్నాలు. అనుదీప్ కె.వి దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ టైమ్ లో రిలీజైనప్పటికీ జాతిరత్నాలు సినిమా కమర్షియల్ గా బాగా పెర్ఫార్మ్ చేసింది. టాలీవుడ్ లో వచ్చిన ఐకానిక్ కామెడీ సినిమాల్లో జాతిరత్నాలు కూడా ఒకటి.
దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పుడే అన్నారు తప్పించి దాని గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమా సీక్వెల్ అమెరికా నేపథ్యంలో ఉంటుందని, వీసా లేకుండా అక్కడికి వెళ్లిన ఆ ముగ్గురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే దానిపై కథ ఉంటుందని అన్నారు. నిజానికి ఆ నేపథ్యంలో సినిమా వస్తే ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సుంది. ఎందుకంటే ప్రస్తుతం యూఎస్ లో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు కుర్రాళ్లు చేసే రచ్చ ఎలా ఉంటుందనే దానిపై సినిమా చేస్తే తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టు ఇప్పటికిప్పుడు మొదలయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. అటు నవీన్ పోలిశెట్టితో పాటూ ఇటు డైరెక్టర్ అనుదీప్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల జాతిరత్నాలు సీక్వెల్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లడం కష్టమే. ఒకవేళ ఈ సీక్వెల్ ఇప్పుడు రిలీజైతే ఆ క్రేజ్ ను బట్టి ఎంతలేదన్నా రూ.100 కోట్ల మార్క్ ను ఈజీగా దాటేయగలదు.
ఆల్రెడీ కామెడీ జానర్ లో తెరకెక్కిన డీజె టిల్లూకి సీక్వెల్ గా వచ్చిన టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే మ్యాడ్ స్వ్కేర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ చూసి అయినా జాతిరత్నాలు మేకర్స్ సీక్వెల్ ను రూపొందిస్తారేమో చూడాలి.