ప్రమోషన్స్ చేస్తే కలెక్షన్లు రావు.. మరేం చేయాలంటే?
కొన్ని సినిమాలకు విపరీతమైన ప్రమోషన్స్ చేసినా డిజాస్టర్లవుతుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చి సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి.
By: Tupaki Desk | 26 Feb 2025 8:30 PM GMTఏదైనా సినిమాకు కలెక్షన్స్ ఎక్కువ రావాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి అనే విషయం అందరికీ తెలుసు. సినిమాను ఆడియన్స్ లోకి ఎంత ఎక్కువగా తీసుకెళ్తే ఆ సినిమాకు అంత రీచ్ ఉంటుందని అందరూ నమ్ముతూ తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలా అని ప్రమోషన్స్ చేసిన అన్ని సినిమాలూ సూపర్ హిట్ అవ్వాలన్న రూలేం లేదు.
కొన్ని సినిమాలకు విపరీతమైన ప్రమోషన్స్ చేసినా డిజాస్టర్లవుతుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చి సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. దీనిపై తాజాగా ఓ సీనియర్ బాలీవుడ్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ అనాలసిస్ చేశాడు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జావేద్ జాఫ్రి మాట్లాడుతూ, సినిమాలకు ప్రమోషన్స్ ఏ మాత్రం పనికిరావని తీసిపారేశాడు. సినిమా రిలీజ్ కు రకరకాలుగా సినిమా గురించి చేసే ప్రమోషన్స్ అన్నీ వేస్ట్ అని ఆయన తేల్చేశాడు. అంతేకాదు, ఇన్‌స్టా ఫాలోయర్ల నెంబర్ కూడా సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశాడు.
దానికి ఉదాహరణగా ఊర్వశి రౌతెలా పేరు చెప్పుకొచ్చాడు. ఆమెకు ఇన్‌స్టాలో 72 మిలియన్ల ఫాలోవర్లున్నారని, ఆమె ఫాలోయర్లలో కనీసం 10 మిలియన్ మంది టికెట్ కొని సినిమా చూసినా ఆమె నటించిన ప్రతి మూవీ రూ.100 కోట్లు కలెక్ట్ చేసేది కదా అని ప్రశ్నించాడు. ప్రమోషన్స్ మాత్రమే సినిమా హిట్ ను ఫిక్స్ చేయలేవని ఆయన చెప్తున్నాడు.
తాము కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా చోట్లకు వెళ్తామని కానీ ఫైనల్ గా అవేవీ ఉపయోగపడవని జావేద్ తెలిపాడు. అంతేకాదు, రజినీకాంత్ ఆయన నటించిన సినిమాలను ఎప్పుడూ ప్రమోట్ చేయడు. అయినా ఆయన సినిమాలు ఎందుకు కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని ప్రశ్నించాడు జావేద్. అయితే ఇన్ని చెప్తున్న ఆయన్ని సినిమా హిట్టై మంచి కలెక్షన్స్ రావాలంటే ఏం చేయాలంటే, సినిమా ట్రైలర్ బావుండాలంటున్నాడు. సినిమా సేల్ అవాలంటే దానికి ట్రైలరే ముఖ్యమని, అంతేకానీ హీరో హీరోయిన్లు పలు షో లకు వెళ్లి లేనిపోని హడావిడి చేసినంత మాత్రాన ఒరిగేదేం లేదని, ట్రైలర్ మాత్రమే సినిమాకు వసూళ్లను కురిపిస్తుందని జావేద్ జాఫ్రి క్లారిటీ ఇచ్చాడు.