Begin typing your search above and press return to search.

కంగ‌న‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ కోరాడు

కంగ‌న‌పై జావేద్ ప‌రువు న‌ష్టం కేసును దాఖ‌లు చేసారు. ఈ కేసులో కంగనా రనౌత్‌పై జావేద్ అక్తర్ నాన్ బెయిలబుల్ వారెంట్ కోరారు.

By:  Tupaki Desk   |   22 July 2024 2:45 AM GMT
కంగ‌న‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ కోరాడు
X

క్వీన్ కంగ‌న ర‌నౌత్ వ‌ర్సెస్ లిరిసిస్ట్ జావేద్ అక్త‌ర్ వివాదం గురించి తెలిసిందే. ఎనిమిదేళ్లుగా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ ర‌చ్చ‌కెక్కుతూనే ఉంది. 2016లో ఆ ఇరువురి న‌డుమా మాట‌ల యుద్ధం ముదిరి చివ‌రికి కోర్టు కేసుల వ‌ర‌కూ వెళ్లింది. కంగ‌న‌పై జావేద్ ప‌రువు న‌ష్టం కేసును దాఖ‌లు చేసారు. ఈ కేసులో కంగనా రనౌత్‌పై జావేద్ అక్తర్ నాన్ బెయిలబుల్ వారెంట్ కోరారు.

జావేద్ అక్తర్ తరపు న్యాయవాది జే భరద్వాజ్ ఒక పిటిషన్‌ను దాఖలు చేయ‌గా అది విచార‌ణ‌కు వ‌చ్చింది. కంగనా రనౌత్ కోర్టు హాజరు నుండి శాశ్వత మినహాయింపును కోరగా కోర్టు తిర‌స్క‌రించాయి. సెషన్స్ కోర్టు, బాంబే హైకోర్టు కూడా దానిని సమర్థించాయి. అయినా కంగనా కోర్టుకు హాజరు కాకపోవడంపై జావేద్ ఇప్పుడు నాన్ బెయిల‌బుల్ వారెంట్ కోరారు. మినహాయింపు కోరుతూ నటి కంగ‌న‌ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించినట్లు జావేద్ అక్తర్ న్యాయవాది చెప్పారు. కేసు విచారణను ఆలస్యం చేసేందుకు కంగనా ప్రయత్నిస్తున్నారని జావేద్ ఆరోపించారు. ఈ శనివారం నాడు కోర్టుకు హాజరుకానందుకు మండికి చెందిన బిజెపి ఎంపి కంగనా రనౌత్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేశారు. నిందితురాలు (రనౌత్) దరఖాస్తు తిరస్కరించినా కానీ.. ఆమె రావాల్సిన‌ తేదీలలో కోర్టుకు హాజరుకాలేదు. మినహాయింపులు కోరుతూ పిటిష‌న్ దాఖలు చేసింది. 1 మార్చి 2021న ఆమెపై బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది! అని భరద్వాజ్ ఎత్తి చూపారు.

అయితే అంతకుముందు బెయిలబుల్ వారెంట్ జారీ అయినప్పుడు కంగ‌న‌ రనౌత్ కోర్టుకు హాజరై బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయించుకున్నారు. శనివారం విచారణ సందర్భంగా అక్తర్ తరపు న్యాయవాది `నిందితురాలు కోర్టు కార్యకలాపాలను ఆలస్యం చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నార‌ని, ఆమెపై NBW జారీ చేయడం తప్ప వేరే మార్గం లేదని వాదించారు. అయితే కోర్టు ఈ దరఖాస్తును నిలుపుదలలో ఉంచింది. కంగ‌న‌ రనౌత్‌ను హాజరు కావాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా 9 సెప్టెంబరు 2024న విచారణకు హాజరవుతార‌ని కంగ‌న‌ న్యాయవాదులు హామీ ఇచ్చారు.

మార్చి 2016లో అక్తర్ ముంబై నివాసంలో జరిగిన ఒక సమావేశం అనంత‌రం ఈ వివాదం మొద‌లై కేసుల వ‌ర‌కూ వెళ్లింది. కంగ‌న‌ రనౌత్, హృతిక్ రోషన్ న‌డుమ అప్ప‌ట్లో కొన్ని గొడ‌వ‌లు కొన‌సాగుతున్నాయి. ఈమెయిల్స్ ఎక్స్ ఛేంజ్ గురించి అప్ప‌టికి వార్తల్లో ఉన్నారు. ఇది ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రోషన్‌లతో సన్నిహితంగా ఉండే అక్తర్ స్వయంగా కంగ‌నా రనౌత్‌తో సమావేశం నిర్వహించి రోషన్‌కు క్షమాపణలు చెప్పాలని కోరినట్లు సమాచారం. తరువాత 2021లో టెలివిజన్ ఇంటర్వ్యూలో కంగ‌న‌ రనౌత్ 2016 సమావేశం త‌న‌కు పరువు నష్టం కలిగించేలా ఉందనే ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కంగ‌న‌ రనౌత్ కూడా అదే కోర్టులో జావేద్ అక్తర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే అక్తర్‌పై విచారణను సెషన్స్ కోర్టు నిలిపివేసింది.

ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. త‌నపై పరువు నష్టం కలిగించిందని ఆరోపిస్తూ జావేద్ అక్తర్ ప్రారంభించిన విచారణను నిలిపివేయాలని కంగ‌న ఆ పిటిష‌న్ లో కోరింది.కంగనా తనపై అక్తర్ చేసిన ఫిర్యాదు ..అక్తర్‌పై ఆమె చేసిన ఫిర్యాదు క్రాస్ కంప్లైంట్‌లని, వాటిని ఉమ్మడిగా విచారించాలని వాదిస్తూ స్టే కోరింది.

2020లో ఓ చానెల్ ఇంటర్వ్యూలో జావేద్ అక్త‌ర్ పై కంగ‌న‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు అవ‌మాన‌క‌రంగా ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఆ ఇరువురి న‌డుమా ఎన్ కౌంట‌ర్ మొద‌లైంది. త‌ద‌నంత‌రం కోర్టుల ప‌రిధిలోకి కేసు చేరుకుంది.