యానిమల్ సక్సెస్ ప్రమాదకరం: జావేద్ అక్తర్
అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) 9వ ఎడిషన్‌లో పాల్గొన్న జావేద్ అక్తర్ యానిమల్‌ను విమర్శిస్తూ.. ఈ విజయం ప్రమాదకరమని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 6 Jan 2024 5:10 PM GMTయానిమల్ విజయంపై పాపులర్ వెటరన్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రణబీర్ కపూర్ రివెంజ్-క్రైమ్ డ్రామా యానిమల్ పై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ గత సంవత్సరం అతి పెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటైన యానిమల్.. ఆల్ఫా మగవారి పాత్ర, విషపూరితమైన మగతనం, హింస వంటి అంశాలను పచ్చిగా స్పర్శించడంతో తీవ్రంగా ట్రోలింగుకి గురైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్'పై సినీ పరిశ్రమలోని కొందరు తీవ్రంగా కామెంట్లు చేసారు. ఇటీవల ప్రముఖ పాటల రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ కూడా ఘాటుగా స్పందించారు. ఇలాంటి సినిమాల విజయం ఎలా సమస్యాత్మకంగా మారుతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.
అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) 9వ ఎడిషన్‌లో పాల్గొన్న జావేద్ అక్తర్ యానిమల్‌ను విమర్శిస్తూ.. ఈ విజయం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సక్సెస్ ని ఉద్దేశించి అక్తర్ మాట్లాడుతూ.. యానిమల్ విజయానికి మేకర్స్ (దర్శకనిర్మాతలు) కాదు... ప్రేక్షకులు కూడా బాధ్యత వహించాలని సూచించారు. సినిమాలోని వివాదాస్పదమైన రణబీర్ ట్రిప్తీల 'లిక్ మై షూ' సన్నివేశం గురించి మాట్లాడుతూ ''అగర్ కోయి ఫిల్మ్ జిస్ మే ఏక్ ఆద్మీ ఏక్ ఔరత్ సే కహే కి 'తు మేరే జూటే ఛత్'. అగర్ ఏక్ ఆద్మీ కహే కి.. ఔరత్ కో తప్పడ్ మార్ దేనే మే క్యా ఖరాబీ హై, వో పిక్చర్ సూపర్-డూపర్ హిట్ హో, తో యే బడి ఖతర్నాక్ బాత్ హై'' అని వ్యాఖ్యానించారు. వీక్షకులు ఏ రకమైన కంటెంట్‌ను చూడాలనుకుంటున్నారో.. తిరస్కరించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలని కూడా భావితరం ఫిలింమేకర్స్ కి సూచించారు.
జావేద్ సాబ్ 1993 చిత్రం ఖల్ నాయక్ లోని 'చోలీ కే పీచే క్యా హై..' (మాధురి ధీక్షిత్ .. ) అనే చార్ట్ బస్టర్ పాటకు రచయిత. ఆయన యానిమల్ పాత్రల తీరుతెన్నులకు కలత చెందారని అర్థమవుతోంది. 1 డిసెంబర్ 2023న విడుదలైన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా రూ.896 కోట్లను రాబట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా కీలక పాత్రల్లో నటించారు.