Begin typing your search above and press return to search.

డైరెక్టర్ వైఫ్ తో కీర్తి డ్యాన్స్..!

సౌత్ స్టార్ డైరెక్టర్ గా తమిళంలో వరుస హిట్లు అందించిన అట్లీ లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు

By:  Tupaki Desk   |   14 Sep 2023 8:49 AM GMT
డైరెక్టర్ వైఫ్ తో కీర్తి డ్యాన్స్..!
X

సౌత్ స్టార్ డైరెక్టర్ గా తమిళంలో వరుస హిట్లు అందించిన అట్లీ లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. షారుఖ్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించేలా జవాన్ అదరగొట్టేసింది. జవాన్ సక్సెస్ లో షారుఖ్ మెయిన్ హైలెట్ కాగా సినిమాలో నటించిన మిగతా క్యాస్టింగ్, అనిరుద్ మ్యూజిక్ కూడా మెప్పించాయి. ముఖ్యంగా ఈమధ్య సూపర్ ఫాం లో ఉన్న అనిరుద్ రీసెంట్ గా నే రజిని జైలర్ తో క్రేజీ హిట్ కొట్టగా జవాన్ తో ఆ హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు. జవాన్ లో చలెయా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఎన్నో రీల్స్ సోషల్ మీడియాలో సందడి చేశాయి. లేటెస్ట్ గా ఈ సాంగ్ కి మహానటి కీర్తి సురేష్ కూడా రీల్ చేసింది. డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా మోహన్ తో కలిసి చలెయా సాంగ్ కు కాలు కదిపింది కీర్తి సురేష్. షారుఖ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు.

అయితే కొన్నాళ్లుగా షారుఖ్ వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డాడు. షారుఖ్ మార్క్ హిట్ పడి చాలా రోజులైంది అనుకుంటుండగా పఠాన్ తో ఈ ఇయర్ ఆరంభం లోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన జవాన్ కూడా సూపర్ గా రన్ అవుతుంది. షారుఖ్ సక్సెస్ ని సెలబ్రిటీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ అట్లీ వైఫ్ ప్రియా మోహన్ తో కలిసి చలెయా సాంగ్ ని చేస్తూ షారుఖ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది.

ప్రియా మోహన్ సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా కీర్తి చలాకీ తనం ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇక కీర్తి సినిమాల విషయానికి వస్తే తెలుగులో చిరుతో భోళా శంకర్ చేసిన అమ్మడు తమిళంలో మామన్నన్ సినిమాలో నటించింది. ప్రస్తుతం సెట్స్ మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేయాలని చూస్తుంది కీర్తి సురేష్. నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.