Begin typing your search above and press return to search.

జవాన్.. రెండో రోజూ అదే జోరు..

కాబట్టి ఈ వీకెండ్​లో జవాన్ హిందీ వెర్షన్​ మొత్తంగా రూ.230కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Sep 2023 11:38 AM GMT
జవాన్.. రెండో రోజూ అదే జోరు..
X

బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్​ కొత్త సినిమా జవాన్​ భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్​ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొదటి రోజు హిందీ వెర్షన్​లో​ రూ.65కోట్ల నెట్​ వసూళ్లను సాధించింది. రెండో రోజు కూడా అదే రేంజ్​లో వసూళ్లను అందుకుంది. హిందీలో రూ.46కోట్ల నెట్​ కలెక్షన్స్​ కలెక్ట్ చేసింది.

సాధారాణంగా బాలీవుడ్ సినిమాలకు తొలి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లు వస్తాయి. కానీ జవాన్​కు అలా రాలేదు. ఎందుకంటే రెండో రోజు వర్కింగ్ డే కారణంగా నార్మల్​ డ్రాప్​ అయింది. అయినప్పటికీ మూడో(శనివారం), నాలుగో రోజు(ఆదివారం) కోసం భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్​ జరిగాయి. కాబట్టి ఈ వీకెండ్​లో జవాన్ హిందీ వెర్షన్​ మొత్తంగా రూ.230కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇకపోతే ఓవర్సీస్​ విషయానికొస్తే.. పఠాన్ సినిమా లాంగ్ రన్ టైమ్​లో దాదాపు రూ.400కోట్ల వరకు వసూలు చేసింది. జవాన్​ సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల్లో 10 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.83కోట్ల వరకు అందుకుంది. చూడాలి మరి ఓవర్సీస్​లో పఠాన్ రికార్డులను జవాన్ బ్రేక్ చేస్తుందో లేదో.

మొత్తంగా ఈ చిత్రానికి ఇప్పటివరకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.230కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో షారుక్ గత చిత్రం పఠాన్​ను మించిన జవాన్ భారీ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ వీకెండ్​ వసూళ్లతో కలిపి వరల్డ్ వైడ్​గా మొత్తం రూ.500 కోట్ల గ్రాస్​ వసూళ్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే వచ్చే వారం కూడా ఎలాగో పెద్ద సినిమాలు రిలీజ్​లు లేవు కాబట్టి.. ఈ చిత్రం రూ.1000కోట్ల గ్రాస్ వసూళ్లు ఖాయమని అంటున్నారు. చూడాలి మరి కింగ్ ఖాన్​ ఈ చిత్రంతోనూ మరో వెయ్యి కోట్లను కొల్లగొడతారో లేదో.

ఇకపోతే ఈ చిత్రంతో నయనతార, విజయ్‌ సేతుపతి, దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్‌ గ్రోవర్‌, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. రుబెన్‌ ఎడిటర్​గా వ్యవహరించారు. గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. రమణ గిరివసన్‌ స్క్రీన్‌ప్లే కథ అందించారు.