జవాన్ మూవీకి నిజంగా అంత సీన్ ఉందా..?
అయితే, అలాంటి ఈ సినిమాకి బాలీవుడ్ లో మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రివ్యూవర్స్ అయితే, విపరీతంగా రివ్యూస్ ఇస్తున్నారు. దాదాపు అందరు రివ్యూవర్స్ 4.5 రివ్యూలు ఇవ్వడం అందరినీ షాకింగ్ కి గురి చేస్తుంది.
By: Tupaki Desk | 8 Sep 2023 3:21 PM GMTబాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి దక్షిణాదిన పెద్దగా మంచి రివ్యూలు ఏమీ రాలేదనే చెప్పాలి. యాక్షన్ సీన్లు బాగున్నాయని అంగీకరించారు. కానీ, రోటీన్ మరీ గొప్పగా లేదని, అలా అని మరీ తీసేసేలా ఉందని కూడా చెప్పలేదు.
నిజానికి డైరెక్టర్ అట్లీ తీసేమూవీలన్నీ, పాత సినిమాలాకు కాపీ పేస్టుల్లానే ఉంటాయని ఇప్పటికే చాలా సార్లు విమర్శలు వచ్చాయి. ఎప్పుడో వచ్చిన సినిమాల కథను అటు తిప్పి, ఇటు తిప్పి, ఈ కాలానికి తగినట్లు మార్పులు చేస్తూ ఉంటారనే టాక్ ఉంది. ఈ జవాన్ విషయంలోనే అవే మాటలు ఎక్కువగా వినపడుతుున్నాయి. కథలో కొత్తదనం ఏమీ లేదనే అంటున్నారు.
అయితే, అలాంటి ఈ సినిమాకి బాలీవుడ్ లో మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రివ్యూవర్స్ అయితే, విపరీతంగా రివ్యూస్ ఇస్తున్నారు. దాదాపు అందరు రివ్యూవర్స్ 4.5 రివ్యూలు ఇవ్వడం అందరినీ షాకింగ్ కి గురి చేస్తుంది. నిజానికి అంత రివ్యూ ఇచ్చే సినిమా అయితే కాదు అది. కానీ, వారు మాత్రం విపరీతంగా హైప్ ఇస్తుండటం విశేషం.
నిజం చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో టాలీవుడ్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఏ మూవీ తీసినా పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప మాత్రేమే కాదు, చిన్న హీరో నిఖిల్ కార్తీకేయ కూడా పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. ఇది చూసి బాలీవుడ్ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సినిమాలు ప్లాప్ అయిపోయి, టాలీవుడ్ సినిమాలు క్లిక్ అవుతుండటంతో, తట్టుకోలేకపోతున్నారు.
అందుకే, మన సినిమాలను తగ్గించే సాధ్యంలేక, వాళ్ల సినిమాలను వాళ్లే ఎత్తేసుకుంటున్నారు. ఇక్కడి వారికి పెద్దగా నచ్చకపోయినా, వారు మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అని మోసేస్తున్నారు. నిజంగా ఆ సినిమా బాగుంటే, ఇక్కడ కూడా మంచి రివ్యూలే వచ్చేవి కదా. పఠాన్ మూవీకి ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కదా. మరి అంత జెన్యూనిటీ మాత్రం అక్కడ కనిపించడం లేదని తెలుస్తోంది.