Begin typing your search above and press return to search.

భారీగా జవాన్ సౌత్ బిజినెస్..!

జవాన్ సినిమా టార్గెట్ కూడా భారీగానే ఉంది. షారుఖ్ స్టామినా చూపించేలా జవాన్ 1000 కోట్లు రాబడుతుందని బాద్షా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 3:06 PM GMT
భారీగా జవాన్ సౌత్ బిజినెస్..!
X

దశాబ్దం పైగా హిట్ కోసం తపించిపోయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ మొదట్లో పఠాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన పఠాన్ సినిమా షారుఖ్ ఫ్యాన్స్ కోరుకునే బ్లాక్ బస్టర్ అందించింది. అంతేకాదు షారుఖ్ కి కరెక్ట్ సినిమా పడితే సినిమా రేంజ్ ఏంటన్నది కూడా పఠాన్ కలెక్షన్స్ లో చూపించింది. ఆ సినిమాతో ఫాంలోకి వచ్చిన షారుఖ్ తన నెక్స్ట్ సినిమా జవాన్ తో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. పఠాన్ హిట్ తో జవాన్ సినిమా మీద బాలీవుడ్ లో భారీ హైప్ ఏర్పడింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా జవాన్ పై అనుకున్న దాని కన్నా భారీగా రేటు పెడుతున్నారట.

కేవలం నార్త్ మార్కెట్ మీదే కాదు సౌత్ లో కూడా జవాన్ సినిమాపై భారీ రేటు పలికిందని తెలుస్తుంది. జవాన్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కలిపి 150 నుంచి 200 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని టాక్. సౌత్ మొత్తం 250 నుంచి 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఆల్రెడీ నార్త్ లో 400 నుంచి 500 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. సో ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే జవాన్ సినిమా 600 నుంచి 700 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

జవాన్ సినిమా టార్గెట్ కూడా భారీగానే ఉంది. షారుఖ్ స్టామినా చూపించేలా జవాన్ 1000 కోట్లు రాబడుతుందని బాద్షా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. జవాన్ సినిమా కేవలం నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో ఒక భారీ ఈవెంట్ ప్లానింగ్ లో ఉన్నారట. ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. తమిళంలో కూడా అట్లీ కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒక స్టార్ హీరోతో జవాన్ ప్రమోషన్స్ చేయించాలని చూస్తున్నారట.

తెలుగు సినిమాలు హిందీలో భారీగా ప్రమోట్ చేస్తూ అక్కడ మార్కెట్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే జవాన్ మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో కూడా సెపరేట్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారట. అలా చేస్తే సినిమా ఇక్కడ ఆడియన్స్ కి మరింత రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి జవాన్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా బాద్షా సినిమా బాక్సాఫీస్ పై ఆయన మార్క్ కొనసాగిస్తుందా లేదా అన్నది సెప్టెంబర్ 7 తర్వాత తెలుస్తుంది.