సీన్ కోసం రూంలోకి పిలిచి అతి చేశాడు..
సీన్ చెబుతానంటూ రూంలోకి తీసుకెళ్లిన ఒక కో డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. 'అయితే.. వాడు ఆర్నెల్ల లోపే చనిపోయాడు.
By: Tupaki Desk | 16 Sep 2023 5:07 AM GMTఅందానికి అందం.. అభినయానికి ఏ మాత్రం తక్కువ లేనప్పటికీ అవకాశాలు రావటం అంత తేలికైన విషయం కాదు. అన్ని ఉన్నా.. ఏదోఒక లోటు వెంటాడుతూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు జయలలిత. చిరంజీవిని స్టార్ చేసిన ఖైదీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం మిస్ కావటం దగ్గర నుంచి జయలలిత కెరీర్ ను చూస్తే.. సరిగా సాగలేదని చెప్పాలి. కుటుంబం కోసం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓకే చెప్పేయటం ఆమెకు శాపమైందని చెప్పాలి. సీనియర్ నటిగా.. ప్రత్యేక గుర్తింపు ఉన్న జయలలిత.. తన ఆకర్షణతో లక్షలాది మందికి నిద్రలు లేకుండా చేసింది.
తన కెరీర్ గురించి.. తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాల్ని చెప్పుకొచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతో పాటు.. వ్యాంప్ క్యారెక్టర్లకు జీవం పోసే జయలలిత జీవితం చూస్తే ఎత్తుపల్లాలు ఎక్కువగానే కనిపిస్తాయి. తెలుగు.. తమిళం.. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం కమల్ నటించిన ఇంద్రుడుచంద్రుడు సినిమాతో పరిచయమయ్యారు.
ఆ తర్వాత బోలోడెన్ని సినిమాల్లో ఆమె నటించారు. వ్యాంప్ పాత్రలతో క్రేజ్ తెచ్చుకున్న ఆమె.. అందుకు భిన్నమైన పాత్రల్లోనూ మెప్పించటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఈ మధ్యన టీవీ సీరియల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన ఆమె.. తన కెరీర్ లోజరిగిన కొన్ని అంశాల్ని చెప్పుకొచ్చారు. గతంలో తాను ఒక మలయాళం మూవీ చేసేటప్పుడు తనతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని చెప్పుకొచ్చారు.
మలయాళంలో తనకు అదే మొదటి సినిమా అని.. తనకు భాష రాదని.. సీన్ చెబుతానంటూ రూంలోకి తీసుకెళ్లిన ఒక కో డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. 'అయితే.. వాడు ఆర్నెల్ల లోపే చనిపోయాడు. అతనెలా చనిపోయాడు నాకు తెలీదు' అని షాకింగ్ నిజాన్ని చెప్పారు. తన కెరీర్ లో అత్యధిక రెమ్యునరేషన్ రామానాయుడు ఇచ్చారని చెప్పారు. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు తనకు రూ.లక్ష ఇచ్చారన్నారు. అంత మంచి క్యారెక్టర్ తర్వాత తనకు ఏ సినిమాలోనూ రాలేదన్న ఆమె.. తన డేట్లు మొత్తం తన తండ్రి.. సోదరుడు చూసేవారన్నారు.
బాలక్రిష్ణ తనతోచాలా సరదాగా మాట్లాడేవారని.. చిరంజీవి కూడా ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలుకరించేవారన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఉంటాయన్న ఆమె.. సెట్ లో ఆలస్యంగా భోజనం పెడితే మాత్రం తాను శాపం పెడతానని నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన సినిమాల కారణంగా కళాతపస్వి కె. విశ్వనాధ్ బంధువుతో పెళ్లి సంబంధం పోయిందన్న ఆమె మాటల్ని విన్నప్పుడు రీల్ లైఫ్ రియల్ లైఫ్ ను ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది.