విడాకులు కఠిన నిర్ణయమే..కానీ తొందర పడలేదు! జయం రవి
కోలీవుడ్ నటుడు జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Sep 2024 7:45 AM GMTకోలీవుడ్ నటుడు జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. భార్య ఆరతితో ధాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు నెట్టింట ప్రచారం ఒకానొక దశలో తారా స్థాయిలోనే జరిగింది. ఈ ప్రచారాన్ని జయం రవి కూడా ఖండించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ జయం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం రవి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు ఆరోపణలు చేయొద్దని జయం రవి కోరారు. దీనికి సంబంధించి ఓ లేఖ విడుదల చేసాడు. ` చాలా ఆలోచనలు ,చర్చల తర్వాత, ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకుంటున్నాను. ఇది కఠినమైన నిర్ణయమే. కానీ ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు. ఎన్నో విషయాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
ఇది వ్యక్తిగత కారణాల వల్ల వచ్చింది అని నేను నమ్ముతున్నాను. జీవితంలో ఓ కీలకమైన అధ్యాయాన్ని ముగించాను. నా అభిమానులు, మీడియా నుంచి సున్నితంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాను. మా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను. దీనిపై ఊహాగానాలు, పుకార్లను , ప్రత్యేక కారణాలు పుట్టించొద్దు అని కోరుతున్నా` అన్నారు.
జయం రవి, ఆర్తి 2009 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే 15 ఏళ్ల బంధానికి ఈ జోడీ స్వస్తి పలికింది. ఇద్దరు విడిపోతున్నట్లు ఈ ఏడాది జూన్ లో నెట్టింట ప్రచారంలోకి రావడం విశేషం. పెళ్లైన నెలలోనే విడిపోతున్నట్లు ప్రచారం జరగడం..ఇప్పుడు అది నిజమేనంటూ జయం రవి మీడియా ముందుకు రావడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.