Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ద‌ర్శ‌కుడు.. టాప్ క‌మెడియ‌న్ హీరో?

జయం రవి తమిళ చిత్రసీమలో ప్రామిసింగ్ స్టార్‌లలో ఒకరు. త‌ని ఒరువ‌న్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించాడు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 9:30 PM GMT
స్టార్ హీరో ద‌ర్శ‌కుడు.. టాప్ క‌మెడియ‌న్ హీరో?
X

జయం రవి తమిళ చిత్రసీమలో ప్రామిసింగ్ స్టార్‌లలో ఒకరు. త‌ని ఒరువ‌న్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించాడు. త‌దుప‌రి `త‌ని ఒరువ‌న్` సీక్వెల్ స‌హా భారీ ప్రాజెక్ట్‌ల్లో న‌టించాల్సి ఉంది. ఇంత‌లోనే జ‌యం ర‌వి ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడంటూ క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ని అత‌డు డైరెక్ట్ చేస్తాడని ప్ర‌చారం సాగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

ఇటీవల త‌మిళ స్టార్ హీరో జయం రవి తన భ‌విష్య‌త్ ప్రణాళికలను ప్రకటించాడు. తన దర్శకత్వ వెంచర్‌లో యోగి బాబును కథానాయకుడిగా నటింపజేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వార్త వేగంగా వైరల్ అయ్యింది. యోగి బాబు జ‌యం ర‌వి ప్ర‌తిపాద‌న‌కు సరదాగా స్పందిస్తూ.. ``నేను వేచి ఉన్నాను సార్`` అని అన్నాడు. అయితే ప్ర‌క‌ట‌న వెలువ‌డినా కానీ ఇది ఎప్ప‌టికి సెట్స్ పైకి వెళుతుందో ఇప్పుడే చెప్ప‌లేం. జయం రవి తన దర్శకత్వ అరంగేట్రం అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తాడో.. అతడు యోగి బాబుతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంటాడా లేదా అనేది చూడాలి.

భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ తర్వాత జయం రవి ముంబైకి మకాం మార్చారని త‌మిళ‌మీడియాలు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. జ‌యం ర‌వి బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే... అత‌డు న‌టించిన `బ్ర‌ద‌ర్` దీపావళికి విడుదల కానుంది. ఎం. రాజేష్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీపై అంచ‌నాలున్నాయి. `జెనీ` అనే చిత్రంలోను జ‌యం ర‌వి న‌టిస్తున్నాడు. కాదలిక్క నేరమిల్లై, JR 34 వ‌రుస‌గా తెర‌కెక్కుతున్నాయి.