Begin typing your search above and press return to search.

విడాకుల‌పై ప్ర‌జా తీర్పు.. విసిగిపోయిన స్టార్ హీరో

ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో దీనిపై బోలెడంత ట్రోలింగ్ న‌డిచింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 3:30 AM GMT
విడాకుల‌పై ప్ర‌జా తీర్పు.. విసిగిపోయిన స్టార్ హీరో
X

త‌మిళ స్టార్ హీరో జ‌యం ర‌వి త‌న భార్యకు విడాకులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. బెంగ‌ళూరుకు చెందిన వైద్యురాలితో ఎఫైర్ కార‌ణంగానే అత‌డు భార్య నుంచి విడిపోతున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో దీనిపై బోలెడంత ట్రోలింగ్ న‌డిచింది.


అయితే దీనిని జ‌యం ర‌వి అప్ప‌ట్లోనే ఖండించాడు. తన విడాకులు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత జయం రవి గలాట్టా ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, విడాకుల గురించిన ఊహాగానాలపై పబ్లిక్ స్క్రూటినీ గురించి మాట్లాడారు. సెప్టెంబర్‌లో జయం రవి త‌న భార్య‌ ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక కౌంటర్ పోస్ట్‌లో `సమ్మతి లేకుండా నిర్ణయం` తీసుకున్నట్లు ఆర్తి పేర్కొన్నారు.

విడాకుల గురించి ప్రజాభిప్రాయాలకు ఎలా స్పందిస్తారు? అని ప్ర‌శ్నించ‌గా, జయం రవి మాట్లాడుతూ, ``మేము పబ్లిక్ మీడియంలో ఉన్నాము..నేను టీ తాగినా, తుమ్మినా ద‌గ్గినా.. ఏం చేసినా ఎలివేట్ అవుతుంది. ఇది మాస్ మీడియం.. మేం మాస్ స్టార్స్. కాబట్టి అది మంచి భావన లేదా చెడు భావన ..ఏదైనా మేం దానిని ఆప‌లేం. ..అని అన్నారు.

ప్రజలు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండ‌గ‌ల‌రు? అనే ప్రశ్నకు జయం రవి వ్యాఖ్యానిస్తూ ``నా వృత్తి కోసం నా శరీరం, మనస్సు ఆలంబ‌న‌గా ఉండాలి. నేను వ్యక్తులకు వ్యక్తిగత బాధ్యతను నేర్పించలేను. కొంతమంది పరిణతి చెందిన వ్యక్తులు అలా చేయరు. పుకార్లు ప్ర‌చారం చేయకూడ‌దు. కొంద‌రు వ్యక్తులు విషయంలోని తీవ్రత గురించి పట్టించుకోరు. నా గురించి నాకు తెలిసినప్పుడు ఇతరుల ప్ర‌చారం గురించి నేను ఎందుకు బాధపడాలి?`` అని అన్నారు. తాను తొందరపడి విడాకుల నిర్ణయం తీసుకోలేదని జయం రవి తన నోట్‌లో పేర్కొన్నాడు. చాలా ఆలోచించాక‌, చాలా చర్చల తర్వాత ఆర్తితో వివాహాన్ని రద్దు చేయడానికి నేను కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు. ఇది ఉత్తమ ప్రయోజనాల కోసం నిర్ణ‌యం`` అని అన్నారు. ఆర్తి దీనికి కౌంట‌ర్ వేస్తూ.. నా భ‌ర్త‌తో మాట్లాడే అవ‌కాశం రాలేదు. అది ఒక‌వైపు తీసుకున్న నిర్ణ‌యం .. దానికి నేను అంగీక‌రించ‌లేను అని అన్నారు.

ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ ఎ మోహన్ తనయుడు జయం రవి. జయం, దాస్, మజై, బొమ్మరిల్లు, పేరన్‌మై, రోమియో జూలియట్, భూమి, సైరన్, తని ఒరువ‌న్, పొన్నియ‌న్ సెల్వ‌న్ వంటి చిత్రాలలో న‌టించాడు. ఆర్తి టెలివిజన్ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె. జయం రవి - ఆర్తి జంట‌కు ఇద్దరు కొడుకులు ఆరవ్ , అయాన్ ఉన్నారు.