ఆ హీరో దుర్భాషలాడాడు.. గాయని రివర్స్ ట్విస్ట్!
తమిళ హీరో జయం రవి ఇంటి గొడవ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అతడు భార్యకు విడాకులిస్తున్నానని ప్రకటించాక ఇదంతా మొదలైంది.
By: Tupaki Desk | 26 Sep 2024 3:58 PM GMTతమిళ హీరో జయం రవి ఇంటి గొడవ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అతడు భార్యకు విడాకులిస్తున్నానని ప్రకటించాక ఇదంతా మొదలైంది. అయితే ఈ విడాకుల యుద్ధంలోకి ప్రముఖ గాయని కం వైద్యురాలు కెనిషా ఫ్రాన్సిస్ అనే మరో పేరు తెరపైకి వచ్చింది. సర్టిఫైడ్ థెరపిస్ట్ కెనీషా జయం రవితో సంబంధంలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే ఈ ఆరోపణలను ఆ ఇద్దరూ ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని కెనీషా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆరోపణలను తిప్పి కొట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కెనీషా వదిలి పెట్టడం లేదు. అంతేకాదు .. తాజా ప్రకటనలో జయం రవి తనను తిట్టాడని, దుర్భాషలాడాడని కెనీషా ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది.
డిటి నెక్స్ట్‌తో ఇంటర్వ్యూలో వైద్యురాలైన కెనిషా తన క్లయింట్ జయం రవి గురించి చాలా విషయాలు మాట్లాడింది. జయం రవి కష్ట సమయాలను ఎదుర్కోవడంలో ఒక వైద్యురాలిగా అతడికి సహాయపడ్డానని తెలిపింది. ఒక థెరపిస్ట్‌గా నా తల్లితండ్రులను కోల్పోయిన బాధ కంటే.. వారిని అతడు ఎదుర్కొన్న విషయం పెద్దదని నేను మీకు చెప్పగలను. ఆర్తి ఆమె తల్లిదండ్రులతో అతడు పడ్డ కష్టాల గురించి వినడం నాకు చాలా బాధాకరం. లింగంతో సంబంధం లేకుండా ఎవరూ ఇంత నష్టపోవడాకి అర్హులు కాదు. మా థెరపీ సెషన్‌ల గురించి నా నోట్స్ నుండి నేను రవి అనుమతితో కోర్టులో అన్ని సాక్ష్యాలను చూపించగలను.
అతడి భార్య అతడి విషయంలో భయంకరమైన పని చేసిందని, తన తప్పులను కప్పిపుచ్చడానికి నన్ను (కెనీషా) `బలిపశువు`గా ఉపయోగించవద్దని హెచ్చరించింది. రవికి తాను చేసిన సహాయానికి ఆర్తి భయపడుతున్నందున ఆమె తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను బలిపశువుగా ఉపయోగించుకుంటోంది. గత నెల రోజులుగా ఆర్తి చేస్తున్న పని అతడి ప్రతిష్టను దిగజార్చడంతోపాటు, అతడి బ్యాంకు ఖాతాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి... అని తెలిపింది. ``ఇది నా సర్కస్ కాదు.. నేను దీనితో పోరాడలేను. నాపై పుకార్లు ఇలానే కొనసాగితే నేను పరువు నష్టం కోసం చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుంది..`` అని హెచ్చరించారు.
జయం రవితో తన బంధం ఎలాంటిదో వెల్లడిస్తూ ``అతడితో తనకు ఎలాంటి భౌతిక సంబంధం లేదు, మేమిద్దరం మా సరిహద్దులను అర్థం చేసుకున్నాము`` అని స్పష్టం చేసింది. రవి నాకు స్నేహితుడు .. క్లయింట్. తన భార్యకు విడాకుల నోటీసు పంపే వరకు ఆ విషయం నాకు పెద్దగా తెలియదు. ఆమె కూడా ఏమి జరగబోతోందో తెలియదు అని పచ్చిగా అబద్ధం చెప్పింది. మా మధ్య శృంగార సంబంధం గురించిన ఊహాగానాలు మీడియా ఆధారితమైనవి. భవిష్యత్తులో మా మధ్య ఏదైనా జరిగినా మీడియా బాధ్యత వహించాలి.. అని అంది.
మా మధ్య స్నేహం అంతంత మాత్రమేనని కూడా కెనీషా అంది. ప్రధానంగా మా వృత్తిపరమైన జీవితాల చుట్టూ ఇది కేంద్రీకృతమై ఉంది. అతడు తన కుటుంబం గురించి ప్రేమగా మాట్లాడిన వీడియోను చూశాను. రవి ఆర్తితో కాపురంలో మానసికంగా గాయపడిన సమయం (జూన్ నెల)లో థెరపీ కోసం నన్ను కలిసాడు. అతడు తన మాజీ భార్యతో విడిపోవడానికి కారణం నేనే అని కొన్ని కథనాలు ఉన్నాయి. అవి తప్పుడు వాదనలు. అతడు తన లాయర్ ద్వారా పరస్పర అంగీకారంతో విడాకుల నోటీసు పంపిన తర్వాతే అతడు నా దగ్గరకు వచ్చాడు. ఈ విషయం చెన్నైలో ఎవరికీ తెలియకూడదని ఆయన నన్ను సంప్రదించారు. నేను అతడిని క్లయింట్‌గా వెంటనే అంగీకరించలేదు.. నేను అతడికి నిజంగా సహాయం చేయగలనని నిర్ధారించుకున్నాకే అంగీకరించాను.. అని కెనీషా సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
తాను -రవి గోవాలో అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేస్తున్నామనే పుకార్లను కూడా కెనీషా ప్రస్తావించింది. నేను ఆన్‌లైన్‌లో చూస్తున్నవి కఠోరమైన ఆరోపణలు .. పూర్తిగా అబద్ధాలు. నేను కొన్నాళ్లు మౌనంగా ఉండగలను. నా చిత్తశుద్ధిని ఎవరైనా ప్రశ్నించే హక్కు లేదు. ద్వేషపూరిత వ్యాఖ్యలు లేదా నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు సరికాదు.. అని అంది.