ఆస్తి అంతా భార్య పిల్లలకు ఇచ్చేశాను: జయం రవి
పొన్నియిన్ సెల్వన్ 1 , పొన్నియన్ సెల్వన్ 2 బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.
By: Tupaki Desk | 24 Sep 2024 3:31 AM GMTపొన్నియిన్ సెల్వన్ 1 , పొన్నియన్ సెల్వన్ 2 బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలతో జయం రవి మంచి పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా అతడు ఏల్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా జయం రవి కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించాడు.
చివరగా సెప్టెంబర్ 9 న జయం రవి తన సోషల్ మీడియాలో ఆర్తితో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబరు 11న దీనికి ప్రతిస్పందనగా ఆర్తి తన అనుమతి లేకుండా తనకు ఏదీ తెలియకుండా తన భర్త ఇలా ప్రకటించాడని, తనకు సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. పెద్దలతో మంతనాలు సాగిస్తున్నానని కూడా వెల్లడించింది.
సెప్టెంబరు 9న జయం రవి విడాకుల ప్రకటనను పబ్లిక్ చేయడానికి కారణమేమిటి? ఈ ప్రశ్న అడగ్గా ఇండియా టైమ్స్ కి అతడు స్పష్ఠమైన వివరణ ఇచ్చాడు. నేను సెప్టెంబర్ 9కి ముందు నెలల్లో ఆర్తికి రెండు లీగల్ నోటీసులు పంపాను. వాటిలో దేనికీ ఆమె స్పందించలేదు. నేను విడాకుల ప్రకటనను బహిరంగపరచవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఈ విషయంలో చాలా పుకార్లు ఉన్నాయి. నా అభిమానులకు నేను జవాబుదారీగా ఉన్నాను. మీడియాలో అందరూ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నిశ్శబ్దంగా ఎలా కూర్చుంటాను? నేను ఇప్పటికే చట్టపరమైన చర్యలను ప్రారంభించాను. దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావించాను.. అని స్పష్ఠంగా చెప్పుకొచ్చాడు.
ఆర్తి తనకు తెలియకుండా విడాకులు ప్రకటించారని అన్నారని, కానీ తన తల్లికి దాని గురించి చెప్పాకే మీడియా ఎదుట ప్రకటించానని అన్నారు. ఇక విడాకులు ప్రకటించక ముందే ఆర్తికి, తన పిల్లలకు అన్నిటినీ ఇచ్చేసానని, తన వద్ద ఇప్పుడు ఏమీ లేదని ఉత్త చేతులతో ఉన్నానని కూడా జయం రవి అన్నారు. గాయని, సైకాలజిస్ట్ కెనీషాతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించాడు. కలిసి ఆస్పత్రిని నిర్మించాలని అనుకుంటున్నామని కూడా తెలిపారు. తను చాలా కష్టపడి పైకి వచ్చిందని కూడా వెల్లడించాడు.
తాను పిల్లల కోసమే బతుకుతున్నానని, భార్యతో 20 ఏళ్లు పోరాటం జరిపి అయినా వారిపై హక్కులు తాను పొందుతానని జయం రవి వ్యాఖ్యానించాడు. పెద్ద కొడుకును హీరోను చేసి తాను నిర్మాత అవుతానని కూడా అన్నారు.