జయప్రద రూ.210 స్టోరీ మీకు తెలుసా ?
ఇండియన్ సినిమాలోనే ఎంతో అందమైన ఫేస్ అని ప్రముఖ సినీ నిర్మాత సత్యజిత్ రే పొగిడిన జయప్రద కొన్ని లక్షల మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 8 April 2025 2:45 AMఇండియన్ సినిమాలోనే ఎంతో అందమైన ఫేస్ అని ప్రముఖ సినీ నిర్మాత సత్యజిత్ రే పొగిడిన జయప్రద కొన్ని లక్షల మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. 1970, 80 దశకాల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జయప్రద తన నటనతో, ఆమె డ్యాన్సులతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.
జయప్రద పేరు చెప్పగానే ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఆమెను ఒక గొప్ప హీరోయిన్ గా చెప్తారు. పద్నాలుగేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ను స్టార్ట్ చేసిన జయప్రద తెలుగులో భూమి కోసం అనే సినిమాలో ఓ సాంగ్ లో కేవలం మూడు నిమిషాలు కనిపించారు. ఆ సాంగ్ కోసం ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం రూ.210 మాత్రమే.
అలా మొదలైన జయప్రద జర్నీ ఇప్పటికీ తెలుగు సినిమాలో భాగంగానే ఉంది. ఆమె నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బంగారంనే మారింది. సీనియర్ ఎన్టీఆర్ తో ఆమె చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కన్నడలో రాజ్‌కుమార్ సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు జయప్రద.
అయితే ఈ రెండు భాషలతో జయప్రద ఆగలేదు. హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అమితాబ్ బచ్చన్, జితేంద్రతో సినిమాలు చేశారు. తమిళంలో కమల్‌హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలతో జట్టు కట్టి అప్పట్లోనే తనను తాను పాన్ ఇండియన్ హీరోయిన్ గా మలచుకున్నారు. కానీ 1990 మధ్య నాటికి జయప్రద క్రమంగా సినిమాలకు దూరమై రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
టీడీపీతో పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన జయప్రద, తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్ లో చేరారు. 2019 నుంచి జయప్రద బీజీపేలో ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె రాజ్యసభ మరియు లోక్‌సభ రెండింటిలోనూ పార్లమెంట్ మెంబర్ గా పని చేశారు. ఒక చిన్న రీజనల్ సినిమాలో టీనేజ్ డ్యాన్సర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన జయప్రద ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకమైన స్థానంలో ఉండేంత వరకు ఎదిగిందంటే ఆమె జర్నీ అందరికీ ఎంతో స్పూర్తిదాయకం.