Begin typing your search above and press return to search.

స్టార్‌ ఇంట పెళ్లి ఇంత సింపుల్‌గానా..?

జయరాం, పార్వతి దంపతుల కూతురు మాళవిక పెళ్లి పాలక్కడ్‌ కి చెందిన నవనీత్ గిరీష్ తో గురువాయర్ ఆలయంలో సింపుల్‌ గా జరిగింది.

By:  Tupaki Desk   |   3 May 2024 10:36 AM GMT
స్టార్‌ ఇంట పెళ్లి ఇంత సింపుల్‌గానా..?
X

తెలుగుతో పాటు తమిళ మరియు మలయాళ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న జయరాం ఇంట పెళ్లి వేడుక సింపుల్‌ గా జరిగింది. స్టార్ సెలబ్రిటీ అయిన జయరాం ఇంట పెళ్లి ఇంత సింపుల్‌ గా జరిగిందేంటి అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

జయరాం, పార్వతి దంపతుల కూతురు మాళవిక పెళ్లి పాలక్కడ్‌ కి చెందిన నవనీత్ గిరీష్ తో గురువాయర్ ఆలయంలో సింపుల్‌ గా జరిగింది. ఈ వివాహానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు అయిన బంధు మిత్రులు మాత్రమే హాజరు అయినట్లుగా సమాచారం అందుతోంది.

నేడు త్రిస్సూర్‌ లోని ఓ కన్వెన్షన్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ను ప్లాన్‌ చేసినట్లు మలయాళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి కేరళ సీఎం హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు మాట్లాడుకుంటున్నారు.

తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులకు కూడా జయరాం ఆహ్వానాలు పంపించారని, వారిలో కొద్ది మంది అయినా ఈ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశ్వీరద్వించే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో మాళవిక మరియు గిరీష్ ల పెళ్లి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.