Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు కోర్టులో లొంగిపోయిన జ‌య‌ప్ర‌ద‌

జయప్రదపై పలుమార్లు నోటీసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు చేయాల‌ని న్యాయ‌నిర్ణేత‌లు ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   4 March 2024 1:51 PM GMT
ఎట్ట‌కేల‌కు కోర్టులో లొంగిపోయిన జ‌య‌ప్ర‌ద‌
X

గ‌త కొంత‌కాలంగా రాజ్యసభ మాజీ ఎంపీ, నటి జయప్రద ప‌రారీలో ఉన్నార‌ని, త‌న కోసం పోలీసులు గాలిస్తున్నార‌ని వార్తా క‌థ‌నాలొస్తున్నాయి. 2 కేసుల్లో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ కావ‌డంతో 'పరారీ'లో ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ప‌రారీని ప్ర‌క‌టించిన‌ వారం తర్వాత రాజ్యసభ మాజీ ఎంప జయప్రద రాంపూర్ కోర్టులో లొంగిపోయారు.

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంబంధించిన రెండు కేసుల్లో 'పరారీ'గా పరిగణించిన ఓర్మెర్ బీజేపీ ఎంపీ, సినీ నటి జయప్రద వ‌రుస త‌ప్పులు చేస్తున్నార‌ని, ఈ ప‌రారీ స‌రికాద‌ని క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఆమె కోర్టు ఎదుట లొంగిపోయారు.

జయప్రదపై పలుమార్లు నోటీసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు చేయాల‌ని న్యాయ‌నిర్ణేత‌లు ప్ర‌క‌టించారు. అనేకసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసిన తర్వాత కూడా ఫిబ్రవరి 27వ తేదీన కోర్టుకు హాజరు కానందుకు రాంపూర్‌లోని ఎంపి/ఎమ్మెల్యే కోర్టు సిఆర్‌పిసి ఆర్డర్ 82 జారీ చేసింది. దీనికి సంబంధించి సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ తివారీ 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేసు గురించి వివ‌రించారు. జయప్రదపై కేసు ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు, రాంపూర్, కెమ్రీ పోలీస్ స్టేషన్... స్వర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది.