Begin typing your search above and press return to search.

ఐదుగురు మోడ‌ల్స్‌తో శృంగారం.. బుక్క‌యిన యాక్ష‌న్ హీరో

64 ఏళ్ల స్టార్ వాన్ డ‌మ్ కు క్రిమిన‌ల్ గ్రూప్ స‌భ్యులు అమ్మాయిల‌ను బహుమతిగా సమర్పించారు.

By:  Tupaki Desk   |   3 April 2025 2:44 PM
ఐదుగురు మోడ‌ల్స్‌తో శృంగారం.. బుక్క‌యిన యాక్ష‌న్ హీరో
X

పాపుల‌ర్ హాలీవుడ్ హీరో వాన్ డ‌మ్ ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ లో చిక్కుకున్న ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. పాపుల‌ర్ ఆంగ్ల మీడియా క‌థ‌నం ప్రకారం.. అత‌డిపై రొమేనియన్ డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం (డిఐఐసివోటి) విభాగానికి క్రిమినల్ ఫిర్యాదు అందింది. గ్యాంగ్ స్ట‌ర్ మోరెల్ బోలియా నేతృత్వంలోని క్రిమినల్ గ్రూప్ వాన్ డామ్ కి విదేశీ మ‌హిళ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసింది. వారితో అత‌డు శృంగార‌క‌లాపాలు సాగించాడు. క్రిమిన‌ల్ గ్రూప్ తో అత‌డి స్నేహం ఇప్పుడు స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెట్టింది.

64 ఏళ్ల స్టార్ వాన్ డ‌మ్ కు క్రిమిన‌ల్ గ్రూప్ స‌భ్యులు అమ్మాయిల‌ను బహుమతిగా సమర్పించారు. కేన్స్‌లో వాన్ డ‌మ్ స్వ‌యంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ దందా కొన‌సాగింద‌ని అధికారులు క‌నుగొన్నారు. అత్యంత దుర్భ‌ర ప‌రిస్థితుల్లో ఉన్న మ‌హిళ‌లు లైంగికంగా దోపిడీకి గుర‌వుతున్నార‌ని విచార‌ణ‌లో బాధితుల త‌ర‌పు న్యాయ‌వాది యాంటెనా 3కి చెప్పారు. అస‌లు ఈ క్రిమిన‌ల్ గ్రూప్ ఎలా మొద‌లైంది? అని ఆరాలు తీస్తున్న అధికారుల‌కు క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాలు తెలిసాయి. ఇందులోనే హాలీవుడ్ స్టార్ వాన్ డ‌మ్ బుక్క‌య్యాడు. ప్రస్తుతం దర్యాప్తు ప్ర‌కారం.. జీన్-క్లాడ్ వాన్ డామ్‌కు ఐదుగురు రొమేనియన్ మహిళలను (ఫోటో మోడల్స్) లైంగికంగా అత‌డిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి గిఫ్ట్ గా ఇచ్చారు.

నిజానికి రొమేనియాలో లైంగిక క‌లాపాల కోసం.. స్త్రీల‌ను అక్రమ రవాణా చేయించే నేరాలకు పాల్పడిన ఏకైక వ్యక్తి వాన్ డామ్ మాత్రమే కాదు. 2022లో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టయిన తర్వాత సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్లు ఆండ్రూ, ట్రిస్టన్ టేట్‌లను నిర్భంధించి విచారించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవలే వీరిని దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించారు.