ఆ స్టార్ డైరెక్టర్ నుంచి మరో హిట్ కంటెంట్!
ఒకప్పుడు మలయాళ సినిమా అంటే ఏదో ఆర్ట్ సినిమాగా కనిపించేది. కేవలం అక్కడి ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయ్యేది.
By: Tupaki Desk | 17 Sep 2024 5:13 AM GMTఒకప్పుడు మలయాళ సినిమా అంటే ఏదో ఆర్ట్ సినిమాగా కనిపించేది. కేవలం అక్కడి ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయ్యేది. కమర్శియల్ యాస్పెక్ట్ లో కంటెంట్ లేకపోవడంతో మిగతా భాషలకు పెద్దగా రీచ్ అయ్యేది కాదు. కానీ జాతీయ స్థాయిలో అవార్డలు మాత్రం మాలీవుడ్ కే సొతమయ్యేవి. కానీ ఇప్పుడు మలయాళం సినిమా కూడా ట్రెండ్ మార్చిన సంగతి తెలిసిందే. సౌత్ లో ఆ సినిమా కంటెంట్ కి మంచి ఆదరణ దక్కుతోంది ఇప్పుడు. సొంత భాషను మంచి మంచి వసూళ్లను తెలుగు, తమిళ్ లో సాధిస్తున్నాయి.
ఇంకా మాలీవుడ్ కంటెంట్ ని అత్యధికంగా దిగుమతి చేసుకునే పరిశ్రమగాను టాలీవుడ్ కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. విజయం సాధించిన చిత్రాల్ని భారీ ఎత్తున తెలుగులోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తద్వారా మలయాళ ఆర్టిస్టులకు మంచి గుర్తింపు దక్కుతుంది. ఇతర భాషల్లో సైతం అవకాశాలు అందుకుంటున్నారు.
తాజాగా ఇటీవల థియేటర్లో రిలీజ్ అయిన మరో మలయాళ చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది. ఫేమస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన నునాకుజి అనే చిత్రం మంచి సక్సెస్ సాధించింది. సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు ఎంతో పాజిటివ్ గా స్పందించారు. థియేటర్ రిలీజ్ సక్సెస్ తో అన్ని భాషలకు అది రీచ్ అయింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుందనే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈనెల 23 నుంచి సినిమా ఓటీటీ లో అందుబాటులో ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కి జీ-5 అందుబాటులో ఉంచుతుంది.
ఈ సినిమాకథ విషయానికి వస్తే కేరళలోని ఊరిలో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తోన్న ఓ జంట. ఏజీ పుజికున్నెల్(బసిల్ జోసెఫ్), రష్మిత(గ్రేస్ ఆంటోని) ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే అనుకోకుండా వారి లైఫ్ లో ఓ ప్రాబ్లం వస్తుంది. వారి పర్సనల్ వీడీయో ఒకటి తమ ల్యాప్ టాప్ లో ఉంటుంది. దానిని ఇన్ కమ్ టాక్స్ అధికారులు తీసుకెళ్తారు. ఇకపై ఆ వీడియో కోసం ల్యాప్ ని తిరిగి ప్రయత్నించండి. అదే సమయంలో వారు కొన్ని అబద్దాలు చెప్తారు. వాటివల్ల వారికెదురైన సమస్యలేంటి? ఇంతకి ఆ పర్సనల్ వీడియో బయటకు లీక్ అయ్యిందా ? ల్యాప్ టాప్ ని తిరిగి తీసుకున్నారా లేదా అన్నది కథ.