ఓటీటీలో వస్తే కానీ విలువ తెలియలేదు
రంగం ఫేం జీవా నటించిన ఓ మూవీ ఇటీవలే థియేటర్లలోకి విడుదలైంది.
By: Tupaki Desk | 2 Nov 2024 4:41 AM GMTరంగం ఫేం జీవా నటించిన ఓ మూవీ ఇటీవలే థియేటర్లలోకి విడుదలైంది. అయితే రజనీకాంత్ వేట్టైయాన్ హోరులో ఈ సినిమా పేరు అంతగా వినబడలేదు. కంటెంట్ బావున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత రేంజుకు చేరకపోవడానికి పెద్ద సూపర్ స్టార్ తో జీవా పోటీపడటం ఒక కారణమైతే ఓటీటీ వీక్షణ కోసం వేచి చూసే ఆడియన్స్ మరో పెద్ద సమస్య.
టైటిల్ బ్లాక్ నిజంగానే ఆసక్తిని కలిగిస్తోంది. సినిమా ఆడియెన్ నుంచి సానుకూల స్పందనలను పొందింది.
రజనీ వెట్టైయన్ మిశ్రమ స్పందనలను పొందడంతో రెండవ వారాంతం తర్వాత తమిళనాడులోని చాలా థియేటర్లలో `బ్లాక్` సినిమాతో రీప్లేస్ చేసారు.
బ్లాక్ చిత్రం బావుంది కానీ ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. అందువల్ల ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.. బ్లాక్ చివరికి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. థియేటర్లలో మిస్సయిన వారంతా ఓటీటీలో దీనిని ఆదరిస్తున్నారు. సినిమా చాలా బావుందని చెబుతుంటే అది చిత్రబృందంలో హుషారు నింపుతోంది.
బ్లాక్ మూవీ 2013లో విడుదలైన హాలీవుడ్ మూవీ కోహెరెన్స్‌కి రీమేక్. కోలీవుడ్‌లో 2024లో విడుదలైన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి అంటూ వీక్షకులు ప్రశంసిస్తున్నారు. జీవా సీనియర్ నటుడు. అతడి నటన కూడా ఆకట్టుకుంది. బ్లాక్ కి కొత్త కుర్రాడు కేజి బాలసుబ్రమణియం దర్శకత్వం వహించారు.