గాలా ఈవెంట్ లో జివ్వుమనిపించిన జెన్నీ!
హాలీవుడ్ సంచలనం -నటి - గాయని జెన్నీఫర్ లోపేజ్ గురించి పరిచయం అవసరంలేదు. జెన్నీ తెలియని సంగీత ప్రియుడు ఉండడు
By: Tupaki Desk | 9 May 2024 7:00 AM GMTహాలీవుడ్ సంచలనం -నటి - గాయని జెన్నీఫర్ లోపేజ్ గురించి పరిచయం అవసరంలేదు. జెన్నీ తెలియని సంగీత ప్రియుడు ఉండడు. పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ. నటిగానూ అంతే ఫేమస్ అయింది. ఇక జెన్నీ వయసు అయిదు పదులు దాటినా అందాల ప్రదర్శనలో మాత్రం మార్పులేం రాలేదు. నవ నాయికలా ఇప్పటికీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అగ్గి రాజేస్తూనే ఉంటుంది.
సాధారణ అరబోత అయితే పర్వాలేదు. అమ్మడు ఎప్పుడు నెట్టింటికొచ్చిన అసాధరణమైన అందాల ఆరబోతతోనే సెగులు పుట్టిస్తుంది. టాప్ టూ బాటమ్ దెబ్బకి కుర్రాళ్లు అలా స్టన్ అవ్వాల్సిందే. ఇక అవార్డు వేడుకల్లో జెన్నీ హోయల గురించైతే ప్రత్యేకంగా పొగడాల్సిన పనిలేదు. అమ్మడు డిజైనర్ దుస్తుల్లో వేదికపై కనిపించిందంటే? మెరుపులు మామూలుగా ఉండవు. తాజాగా జెన్నీఫర్ లోపేజ్ మరోసారి మెట్ గాలా 2024 ఈవెంట్ లో తళుక్కున మెరిసింది.
54 సీక్విన్స్ -పూసలతో కూడిన ఫిగర్-హగ్గింగ్ షీర్ షియాపరెల్లి గౌను ధరించారు. ఇందులో జెన్నీ ఎంతో అందంగా హైలైట్ అయింది. ఆ గౌను జెన్నీ అందాన్ని మరింత రెట్టింపు చేసింది. డ్రెస్ మ్యాచింగ్ మెడలో నక్లెస్..చెవులకు పెట్టిన బుట్టలు అంతే అందంగా హైలైట్ అవుతున్నాయి. ఇక జెన్నీ హెయిర్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గోల్డ్ కలర్ షైనింగ్ హెయిర్ జెన్నీ స్కిన్ ని పోలి ఉంది. ఆమె మ్యాకప్ అలంకరణ ప్రతీది ఎంతో అందంగా తీర్చిదిద్దాయి.
అందానికి వయసుతో సంబంధం లేదని జెన్నీ ఫర్ లోపేజ్ మరోసారి ప్రూవ్ చేసింది. 54 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించొచ్చని చాటి చెప్పింది. ఈ ఫోటోని ఉద్దేశించి అమ్మడు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ లుక్ ఎలా ఉంది అంటూ? నెటి జనుల ముందుకిలా వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. గాలా ఈవెంట్ కి జెన్నీ అందం హైలైట్ అంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు.