అదే టైటిల్ తో మరో సినిమా..రిలేషన్ ఏంటబ్బా?
సినిమా కథలు రిపీట్ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఒకే జానర్ కథలో రకరకాల హీరోలు తెలిసో తెలియకో నటించేస్తుంటారు.
By: Tupaki Desk | 15 Feb 2024 2:30 AM GMTసినిమా కథలు రిపీట్ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఒకే జానర్ కథలో రకరకాల హీరోలు తెలిసో తెలియకో నటించేస్తుంటారు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత అయ్యో తప్పు చేసేమో అని వాపోతారు. ఇది అన్ని పరిశ్రమల్లో సహజంగా కనిపించేది. అందరూ హీరోలతోనూ రిపీట్ అయ్యే సన్నివేశమే. ఈ విషయంలో దర్శకుల్ని తక్కువ చేయడానికి లేదు..హీరోల్ని ఎక్కువ చేయడానికి లేదు.
కొన్నిసార్లు యాదృశ్చికంగా ఒకేలా ఉంటాయి. ఇక సినిమాలకు రిపీటెడ్ టైటిల్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక సారి వచ్చిన టైటిల్ తో మరో సినిమా చేయడం అన్నది ఎక్కడో గానీ చోటు చేసుకోదు. అలా టైటిల్ రిపీట్ చేయడం అన్నది సినిమాకి మైనస్ గానూ కనిపించిన సందర్భాలెన్నో. వాటి సక్సెస్ రేటు కూడా పెద్దగా కనిపించని సన్నివేశం ఉంది. ఇప్పుడు ఏకంగా 60 ఏళ్ల క్రితం నాటి టైటిల్ రి రిపీట్ చేస్తూ సినిమా చేయడం విశేషం. అయితే ఈ సాహసం చేస్తుంది టాలీవుడ్ లో కాదు..బాలీవుడ్ లో.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ హీరోగా రాబి గెహ్రాల్ దర్శకత్వంలో సిద్దార్ధ్ ఆనంద్ నిర్మాణంలో ఓ సినిమాకి రంగం సిద్దం అవుతోంది. ఈసినిమాకి `జ్వేల్ థీప్` అనే టైటిల్ ఖరారు చేసారు. ఇదే టైటిల్ 1967లో ఓ సినిమా రిలీజ్ అయింది. దివంగత హీరో దేవానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. విజయ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అశోక్ కుమార్, దేవ్ ఆనంద్, వైజయంతిమాల కీలక పాత్రలు పోషించారు.
అప్పట్లో ఈసినిమా బాగానే ఆడింది. అయితే తాజాగా అదే టైటిల్ తో బాలీవుడ్ లో మరో సినిమా తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ సినిమా కథకి.. అప్పటి సినిమా కథకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తమ స్టోరీ వేరు అని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది.