Begin typing your search above and press return to search.

జైలుకి వెళ్ళడానికి అల్లు అర్జున్ కారణమా?.. జానీ ఏం చెప్పాడంటే?

ఈ సందర్భంగా జానీ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన్ను కలిశారా? అని ప్రశ్నించగా.. "లేదు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీతో టైమ్ గడుపుతున్నాను.

By:  Tupaki Desk   |   25 Dec 2024 11:48 AM GMT
జైలుకి వెళ్ళడానికి అల్లు అర్జున్ కారణమా?.. జానీ ఏం చెప్పాడంటే?
X

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసుతో జైలుకి వెల్లొచ్చిన సంగతి తెలిసిందే. జానీ తనపై పలుమార్లు లైగిక దాడికి పాల్పడ్డారంటూ ఆయన లేడీ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసినప్పుడు తాను మైనర్ అని పేర్కొనడంతో, జానీ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు జైలులో ఉన్న జానీ.. బెయిల్ మీద బయిటకు వచ్చాడు. అయితే జానీ అరెస్టుకు హీరో అల్లు అర్జున్ కారణమంటూ సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఇదే విషయాన్ని తాజాగా మీడియా జానీ వద్ద ప్రస్తావించింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం జానీ మాస్టర్ తన ఫ్యామిలతో కలిసి శ్రీతేజను పరామర్శించారు. ఆయనతో పాటుగా వేణు స్వామి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జానీ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన్ను కలిశారా? అని ప్రశ్నించగా.. "లేదు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీతో టైమ్ గడుపుతున్నాను. నా సాంగ్స్ కు రిహాషల్స్ చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను" అని చెప్పారు.

'మీ అరెస్ట్ కు అల్లు అర్జున్ కారణం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ఎంతవరకు నమ్ముతున్నారు?' అని ప్రశ్నించగా.. "థ్యాంక్యూ సో మచ్. జై హింద్" అంటూ జానీ మాస్టర్ పక్కకి వెళ్ళిపోయారు. అంతకముందు మరో సందర్భంలో బన్నీ అరెస్టుపై జానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఈ అంశంపై ఏం మాట్లాడను. ఎందుకంటే నేనూ ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి.. నా కేసు కూడా కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై కోర్టులపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

కాగా, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' సాంగ్ విషయంలో తలెత్తిన వివాదంతోనే జానీ మాస్టర్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జానీ కొరియోగ్రఫీ చెయ్యాల్సిన పాటను ఆయన అసిస్టెంట్ తో చేయించారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలతోనే ఆమె అతనిపై కేసు పెట్టిందని టాక్ నడిచింది. అందులో నిజమెంతో తెలియదు కానీ, లేడీ కొరియోగ్రాఫర్ కంప్లెయింట్ తో జానీ అరెస్ట్ చేయబడ్డాడు. ఈ కేసులో 36 రోజులు పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్ కూడా రద్దు చేయబడింది. ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చాడు. అయితే జైలుకి వెళ్లి వచ్చినా ఇండస్ట్రీలో మర్యాద బాగానే ఉందని జానీ చెబుతున్నారు.