'సలార్' సైడైనా 'టైగర్ 3'తో పోటీపడుతోంది
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో `సలార్` పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ సలార్ రిలీజ్ వాయిదా పడడంతో ఇప్పుడు పెద్ద సినిమా ఏది వస్తుంది? అంటూ చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 10 Sep 2023 3:53 AM GMTఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో `సలార్` పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ సలార్ రిలీజ్ వాయిదా పడడంతో ఇప్పుడు పెద్ద సినిమా ఏది వస్తుంది? అంటూ చర్చ సాగుతోంది. అయితే పఠాన్- జవాన్ తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రచారంలో ఉన్న టైగర్ 3తో పోటీపడే మరో పెద్ద సినిమా ఏదీ లేదు. ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్‌ల `జిగర్తాండ డబుల్ ఎక్స్` చిత్రం సైలెంట్ గా దూసుకొస్తోంది. ఈ చిత్రానికి రజనీకాంత్ అమితంగా ఇష్టపడే కార్తీక్ సుబ్బరాజ్ రచయిత. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మధురైలో పూర్తయింది. 2014లో `జిగర్తాండ`తో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అదే సమయంలో ఈ కథ ఇప్పుడు హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `జిగర్తాండ డబుల్ ఎక్స్`తో ప్రేక్షకులను అలరించడానికి తెరపైకి రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ అభిమానులలో క్యూరియాసిటీని పెంచింది.
రజనీకాంత్ నటించిన `పెట్టా` (2019) తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌కి ఎలాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం లేదు. కాబట్టి అతడు తన కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన `జిగర్తాండ`కు రెండవ భాగాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటూ దర్శకుడు ట్వీట్ చేశారు. ఇందులో సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 11న 12:12 గంటలకు విడుదల చేయనున్నామని, ఇది మొదటి భాగం టీజర్ కంటే పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని చెప్పారు. `జిగర్తాండ డబుల్ ఎక్స్` పోస్టర్‌ని షేర్ చేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, `జిగర్తాండ డబుల్ ఎట్ సేమ్ టైమ్` దీపావళి సందర్భంగా సినిమా థియేటర్లలోకి రానుందని హ్యాష్‌ట్యాగ్ ద్వారా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ 3' కూడా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. దీంతో ఇరు సినిమాల మధ్యా పోటీ తప్పడం లేదు.
రాఘవ లారెన్స్, ఎస్‌జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా `జిగర్తాండ డబుల్ ఎక్స్` దీపావళి సందర్భంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ..2023 దీపావళికి విడుదల తేదీని ఫిక్స్ చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. ఇందులో మొదటి భాగం జిగర్తాండకు అపారమైన ప్రేమ ఆదరణ లభించాయి. ఈ సినిమా ప్రీక్వెల్ కూడా నిరూపిస్తుందన్న నమ్మకం ఉంది.. అని అన్నారు. నిజానికి ఈ ప్రీక్వెల్ ప్రారంభమై చాలా కాలం అయినా దీనిపై ఇటీవల అప్ డేట్ లేదు. కానీ ఇప్పుడు అప్ డేట్ తో క్యూరియాసిటీని పెంచడంలో చిత్రబృందం ప్రయత్నం సఫలమైంది. ఇక దీపావళి బరిలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగర్ 3 తో పోటీపడి ఈ సినిమా ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.