జిగర్తాండ డబుల్ X టీజర్.. ఊరమాస్ సీక్వెల్
తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియా స్టార్స్ మహేశ్ బాబు, ధనుశ్, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి.. వారి భాషల్లో రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 11 Sep 2023 10:00 AM GMTరాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ఎక్స్'. 8 ఏళ్ల కింద రిలీజై సంచలన విజయం అందుకున్న జిగర్తాండ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియా స్టార్స్ మహేశ్ బాబు, ధనుశ్, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి.. వారి భాషల్లో రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో లారెన్స్ గన్స్ పట్టుకుని, బీడీ తాగుతూ పక్కా మాస్ అవతారంలో కనిపించగా.. ఎస్‌జే సూర్య సూట్ వేసుకుని స్టైల్‌గా కనిపించారు.
కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిమిషా సజయన్ మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. 2009లో వచ్చిన జిగర్తాండ చిత్రాన్ని.. ఈ జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్ గుర్తు చేస్తోంది. ఓ ఫిల్మ్ మేకర్, గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఓ పక్కా క్రైమ్ కథ కోసం వెతుకుతున్న డైరెక్టర్‌కు.. ఓ రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ తన బయోపిక్‌నే సినిమాగా తీయాలని చెప్పడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
ఈ జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్లో డైరెక్టర్ పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించగా.. గ్యాంగ్‌స్టర్ పాత్రను రాఘవ లారెన్స్ పోషించారు. టీజర్లో అన్ని భాషల వరకు కనెక్ట్ అయ్యేలా ఇంగ్లిష్ డైలాగ్స్ మాత్రమే పెట్టారు. 1975 బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా ఆ వాతావరణాన్ని బాగానే క్రియేట్ చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లారెన్స్, సూర్య లుక్స్, యాక్టింగ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో వెస్టర్న్ మేకింగ్ కూడా కనిపిస్తోంది. అందుకే రెండింటినీ కలిపి పాన్ ఇండియాను కాస్త పాండ్యా వెస్టర్న్గా రాబోతున్నట్లు వీడియోలో చూపించారు మేకర్స్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌పై నిర్మించారు. కార్తికేయన్ సంతానం సహా నిర్మాతగా వ్యవహరించారు.
చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు మూవీటీమ్ చెప్పింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు గ్లింప్స్‌లో తెలిపారు మేకర్స్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైపోయింది.