Begin typing your search above and press return to search.

'జిగ్రా' టీజర్: ఆలియా మాస్ యాక్షన్..

బీటౌన్ ప్రముఖ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై రూపొందుతున్న ఆలియా అప్ కమింగ్ మూవీలో టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 11:07 AM GMT
జిగ్రా టీజర్: ఆలియా మాస్ యాక్షన్..
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా ప్రస్తుతం జిగ్రా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆలియా నటిస్తున్న జిగ్రా చిత్రానికి మౌనిక ఓ మై డార్లింగ్ ఫేమ్ వాస‌న్ బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బీటౌన్ ప్రముఖ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై రూపొందుతున్న ఆలియా అప్ కమింగ్ మూవీలో టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాలో నటిస్తూనే ఆలియా భట్ ప్రొడ్యూస్ చేస్తోంది కూడా. 2022లో డార్లింగ్స్ మూవీతో తొలిసారి నిర్మాతగా మారింది ఆలియా. తన ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్ షైన్ పై సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పుడు జిగ్రా నిర్మాణంలో కూడా భాగమైంది. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేశారు మేకర్స్.

విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న జిగ్రా మూవీలో వేదాంగ్ రైనా.. ఆలియా భ‌ట్ తమ్ముడిగా నటిస్తున్నారు. అయితే మేకర్స్ నేడు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కొత్త అప్డేట్ బట్టి.. ఆపదలో ఉన్న తమ్ముడిని కాపాడుకునేందుకు అక్క చేసిన పోరాటమే సినిమా అని క్లియర్ గా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జిగ్రా టీజర్ ట్రైలర్.. సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెంచుతోంది.

అయితే ఆలియా తన జీవితంలో ఎదుర్కొంటున్న అండ్ ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పడంతో టీజర్ ట్రైలర్ స్టార్ట్ అయింది. తన ఫ్యామిలీలో తమ్ముడు, తానే ఉన్నట్లు చెబుతోంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల విదేశాల్లో ఉన్న ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైల్లో పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆలియా తన సోదరుడిని ఎలా విడిపించుకుంది? ఆమెకు ఎవరు సపోర్ట్ చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానమే జిగ్రా మూవీ!

కాగా, ఆలియా చాలా రోజుల తర్వాత కొత్త లుక్ లో కనిపించింది. ధైర్యంతో పోరాడే యువతిగా అలరించనుంది. టీజర్ ట్రైలర్ లో మాస్ యాక్షన్ తో అదరగొట్టింది. సిబ్లింగ్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న జిగ్రా చిత్రంతో మంచి హిట్ కొట్టేలా కనిపిస్తోంది. మనోజ్ పహ్వా.. సినిమాలో ఆలియా మెంటార్ గా నటిస్తున్నారు. మరి జిగ్రా మూవీ సినీ ప్రియులను ఎలా అలరిస్తుందో? ఆలియా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.