Begin typing your search above and press return to search.

'జిగ్రా' తెలుగు ట్రైలర్.. అక్క విజయం సాధిస్తుందా?

లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ గా అలరించనున్న జిగ్రా.. తెలుగులో కూడా విడుదల అవుతుంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:04 AM GMT
జిగ్రా తెలుగు ట్రైలర్.. అక్క విజయం సాధిస్తుందా?
X

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. నేషనల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తో తెలుగులో మంచి ఫేమ్ సంపాదించుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాతో టాలీవుడ్ సినీ ప్రియులకు బాగా చేరువైంది. అయితే రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో రీసెంట్ గా సూపర్ హిట్ అందుకున్న అలియా.. ఇప్పుడు జిగ్రాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.


లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ గా అలరించనున్న జిగ్రా.. తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ జిగ్రా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ రిలీజ్ అయిన రోజే తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే హిందీలో ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. నేడు మరో అప్డేట్ తో వచ్చారు.

జిగ్రా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. బ్ర‌ద‌ర్, సిస్ట‌ర్ సెంటిమెంట్‌ తో సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అలియాకు వచ్చిన ఫోన్ కాల్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత టెన్షన్ పడుతూ ఫోన్ మాట్లాడుతుంది. అలియా తమ్ముడు అంకూర్ (వేదాంగ్ రైనా)ను ఫారిన్ లో అరెస్ట్ చేస్తారు పోలీసులు. కోర్టులో హాజరు పరుస్తారు. దీంతో అతడిని కాపాడుకోవాలని అలియా నిర్ణయించుకుని గట్టిగా పోరాడేందుకు సిద్ధమవుతుంది.

సవాళ్లను ఎదుర్కొంటూ తమ్ముడిని అక్క జైలు నుంచి బయటకు తీసుకొచ్చిందా లేదా అనేది ఈ మూవీ ప్రధానమైన అంశంగా తెలుస్తోంది. అయితే సినిమాలో అలియా తన యాక్షన్ తో మరోసారి మెప్పించనున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. యాక్షన్ సీక్వెన్స్ లో వేరే లెవెల్ లో నటించినట్లు అర్థమవుతోంది. ఎంతో డెడికేషన్ తో ఆమె యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. జిగ్రాతో మరో హిట్ ను అలియా భట్ అందుకుంటుందని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇక మూవీ విషయానికొస్తే.. వాసన్ బాల దర్శకత్వం వహిస్తున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ న‌టుడు రాహుల్ రవీంద్రన్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య నంద, శోభితా ధూళిపాళ్ల, మనోజ్ పహ్వా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న.. జిగ్రా మూవీ హిందీతోపాటు తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.