Begin typing your search above and press return to search.

తమిళ పరిశ్రమలో కాదు: జీవా

తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు జీవా చేసిన వ్యాఖ్యపై తీవ్ర‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2024 5:58 PM GMT
తమిళ పరిశ్రమలో కాదు: జీవా
X

తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు జీవా చేసిన వ్యాఖ్యపై తీవ్ర‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా టుడే క‌థ‌నం ప్రకారం.. అత‌డు కోలీవుడ్‌లో లైంగిక వేధింపుల సందర్భాలను ఖండించాడు. మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల గురించి, అక్క‌డ ప‌రిస్థితుల గురించి బయటపెట్టిన హేమా కమిటీ నివేదిక గురించి ప్ర‌శ్నించ‌గా.. ఒక రిపోర్టర్ ముందు తన కూల్ స్వ‌భావాన్ని కోల్పోయాడు. వేధింపులు కేర‌ళ‌లో జరిగాయి అని , త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో జ‌ర‌గ‌వ‌ని అన్నారు. అయితే అతడి ప్రకటనపై గాయని చిన్మయి శ్రీపాద ప్ర‌తిస్పందించారు.

ఒక ఈవెంట్‌లో రిపోర్టర్‌తో జీవా గొడ‌వ‌కు దిగిన వీడియో X (గతంలో Twitter)లో హల్‌చల్ చేస్తోంది. హేమ కమిటీ నివేదిక గురించి ప్ర‌శ్నించ‌గా..`దాని గురించి విన్నాను` అని చెప్పాడు. ``మాకు #MeToo పార్ట్ 1 ఉంది. ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది. ఇప్పుడు ప్రజలు బహిరంగంగా వారికి (దుర్వినియోగదారులు) పేరు పెడుతున్నారు. ఇది తప్పు. సినిమాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలి`` అని అన్నారు. అంతేకాదు.. ఈవెంట్‌లో `మంచి వాతావరణాన్ని` కొనసాగించడానికి జీవా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు. ``నేను ఇప్పటికే దీనికి ప్రత్యుత్తరం ఇచ్చాను, నేను మళ్లీ మళ్లీ ప్రత్యుత్తరం ఇవ్వలేను. అలాంటి సమస్యలు తమిళ పరిశ్రమలో లేవు. `` అని అన్నాడు.

తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై గ‌తంలో గ‌ళం విప్పిన చిన్మయి గీత రచయిత వైరముత్తు వేధించారంటూ ఆరోపించింది. X లో జీవా క్లిప్‌ను షేర్ చేసింది. ``వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు. తమిళ ఇండస్ట్రీలో వేధింపులు లేవు. ఎలా?!``. విమానాశ్రయంలో రజనీకాంత్ సైతం మీడియాతో మాట్లాడుతూ దాని గురించి తెలియదు! అని నిర్లిప్తంగా వ్యాఖ్యానించారు. దీనిపైనా విమ‌ర్శ‌లొచ్చాయి. ఇప్పుడు జీవా స‌మాధానంపైనా తీవ్ర దుమారం రేగుతోంది.