Begin typing your search above and press return to search.

అశ్లీల వీడియోపై జియో వివ‌ర‌ణ ఇలా!

స‌మాజం ఎటు పోతుంద‌ని, షో పేరుతో నాలుగు గొడ‌ల మ‌ధ్య స‌న్నివేశాల్ని ప‌బ్లిక్ లో కి తెస్తారా? అని దుమ్మెత్తిపోస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 11:14 AM GMT
అశ్లీల వీడియోపై జియో వివ‌ర‌ణ ఇలా!
X

బాలీవుడ్ బిగ్ బాస్ ఓటీటీ మూడో సీజ‌న్ పై వివాదం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ జంట‌కు సంబంధించిన అశ్లీల వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో తీవ్ర దుమారంరేగింది. షో లైవ్ లోనే ఆడ‌-మ‌గ మ‌ధ్య అశ్లీల స‌న్నివేశాన్ని చూపించ‌డం ఏంట‌ని జియో సినిమాపై నెటి జ‌నులు మండిపడుతున్నారు. స‌మాజం ఎటు పోతుంద‌ని, షో పేరుతో నాలుగు గొడ‌ల మ‌ధ్య స‌న్నివేశాల్ని ప‌బ్లిక్ లోకి తెస్తారా? అని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ వీడియో మీద జియో సినిమా వివ‌ర‌ణ ఇచ్చింది. నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఆ వీడియో పేక్ అని ఖండించింది. ఒరిజిన‌ల్ వీడియోకి మార్పింగ్ చేసి సోష‌ల్ మీడియాలో కావాల‌నే వైర‌ల్ చేస్తున్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నంచేసింది. ఇప్ప‌టికైనా అస‌త్య ప్ర‌చారం ఆపాల‌ని కోరింది. అయితే దీనిపై శివ‌సేన వ‌ర్గం అధికార ప్ర‌తినిది మ‌నీషా క‌యాండే ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

ఇలాంటి అస‌భ్యక‌ర స‌న్నివేశాలపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ..పిల్ల‌లు కూడా ఇలాంటి షోలు చూస్తున్నార‌ని, వారిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని, త‌ప్ప‌క వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. షోని వెంట‌నే ఆపేయాల‌ని, సైబ‌ర్ క్రైమ్ చట్టాల కింద కేసు న‌మోదు చేసి నిర్వాహ‌కుల్ని అదుపులోకి తీసుకోవాల‌ని కోరారు. దీంతో ఇది రాజ‌కీయంగానూ హీటెక్కిన‌ట్లు అయింది.

దీని పైనా జియో సినిమా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నంచేసింది. తాము ప్ర‌సారం చేసే ఏ కంటెంట్ అయినా నాణ్య‌త, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు. జియో సినిమాలో అలాంటి కంటెంట్ ఇంత‌వ‌ర‌కూ లేదు. ఆ క్లిప్ చూసి మేము కూడా ఆందోళ‌న‌కు గుర‌య్యాం. దీని వెనుక ఎవ‌రు ఉన్నారో త్వ‌ర‌లోనే క‌నుక్కుంటాం. అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొరుకుతాయ‌ని ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.