Begin typing your search above and press return to search.

రాశీఖ‌న్నా వా? ఆమె చెల్లివా?

'థాంక్యూ' త‌ర్వాత రాశీఖ‌న్నా తెలుగులో పెద్ద‌గా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కోలీవుడ్ టూ బాలీవుడ్ రౌండ్లు వేస్తోంది

By:  Tupaki Desk   |   28 Oct 2023 5:12 AM GMT
రాశీఖ‌న్నా వా? ఆమె చెల్లివా?
X

'థాంక్యూ' త‌ర్వాత రాశీఖ‌న్నా తెలుగులో పెద్ద‌గా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కోలీవుడ్ టూ బాలీవుడ్ రౌండ్లు వేస్తోంది. ఎక్కువ‌గా ఆ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనే క‌నిపిస్తుంది. అప్పుడ‌ప్పుడు ఇన్ స్టాలో ఫోటోలు చూసి తెలుగు ఆడియ‌న్స్ మురిసిపోవ‌డం త‌ప్ప‌! హైద‌రాబాద్ లో క‌నిపించింది లేదు. ఎక్క‌డ అవ‌కాశాలుంటే అక్క‌డికి వెళ్లిపోవ‌డం స‌హ‌జ‌మే. ఆ క్ర‌మంలోనే అమ్మ‌డు చెన్నై.. ముంబై మ‌ధ్య‌లో ఎక్కువ‌గా తిరుగుతుంది.


దీంతో రాశీని టాలీవుడ్ ఆడియ‌న్స్ కూడా దాదాపు మ‌ర్చిపోయే స‌న్నివేశం వ‌చ్చేసింది. ఇన్ స్టాలో ఫోటోలు క‌నిపిస్తే లైక్ కొట్ట‌డం..న‌చ్చితే షేర్ చేయ‌డం త‌ప్ప అంత‌కు మించి అమ్మ‌డి టాపిక్ ఇక్క‌డ పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. తాజాగా రాశీఖన్నా వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అది చూస్తే ఒక్క‌సారిగా స్ట‌న్ అవ్వ‌డం ఖాయం. అమ్మ‌డు స‌న్న‌జాజి సోయ‌గంలా మారిపోయిందంటే? ఆశ్చ‌ర్య‌పోవాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తుంది. అవును.

అమ్మ‌డు ముంబైలో జ‌రిగిన మామి ఫిల్మ్స్ పెస్టివ‌ల్స్ కి హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా రాశీక‌న్నా వంగ‌పువ్వు రంగు లెహంగా దుస్తుల్లో త‌ళుకులీనింది. ఫోటో సెష‌న్ లో భాగంగా రాశీఖ‌న్నా కెమారాకి ఫోజులిచ్చింది. టాప్ టూ బాట‌మ్ ని రాశీని ద‌గ్గ‌ర‌గా ప‌రిశిలిస్తే త‌ప్ప ఆమె రాశీఖన్నా ని గుర్తు ప‌ట్ట‌డం వీలు లేన‌తంగా మారిపోయిది. టాప్ టూ బాట‌మ్ శ‌రీరంలో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. బాగా స‌న్న‌గా మారిపోయింది.

చ‌బ్బీ లుక్ నుంచి గ‌తంలోనే ట్రాన్స‌ప‌ర్ అయింది. కానీ ఇప్పుడు మ‌రింత స‌న్న‌జాజి సోయ‌గంలో మారిపో యింది. అమ్మ‌డు మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. ఓ కొత్త రాశీని చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. రాశీ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. అమె రాశీఖాన్నా? అని డౌట్ ప‌డుతున్నారు.