158 కోట్లకు జోనాస్ బ్రదర్ ఇల్లు అమ్మకం
విశాలమైన 6-బెడ్రూమ్ LA ఆస్తిని జో జోనాస్ - సోఫీ టర్నర్ గత సంవత్సరం విడాకులు తీసుకునే ముందు కలిగి ఉన్నారు
By: Tupaki Desk | 24 Jan 2024 1:30 AM GMTప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ సోదరుడు తన భార్య సోఫీ టర్నర్ నుంచి విడిపోయిన ఘటన అభిమానులను కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ జంట కలతలతో విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆ ఇరువురి నడుమా ఆస్తి పంపకాలు జరుగుతున్న క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఇంటిని అమ్మకానికి పెట్టడం చర్చకు వచ్చింది.
విశాలమైన 6-బెడ్రూమ్ LA ఆస్తిని జో జోనాస్ - సోఫీ టర్నర్ గత సంవత్సరం విడాకులు తీసుకునే ముందు కలిగి ఉన్నారు. ఇది ఇప్పుడు $19 మిలియన్ల డాలర్ల విలువ చేస్తోంది. 2019లో ప్రేమ జంట జో జోనాస్ - సోఫీ టర్నర్ కాలిఫోర్నియాలో 15,000 చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు నిక్ జోనాస్ -ప్రియాంక చోప్రా జోనాస్లకు పొరుగువారు అయ్యారు. అయితే కేవలం రెండు సంవత్సరాల తర్వాత వారు ఇంటిని $16.75 మిలియన్లకు మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ఇది ఎన్సినోలో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఆస్తి. $15.2 మిలియన్ల భారీ ధరతో DJ అండ్ నిర్మాత జెడ్ ఈ ఇంటిని కొనుగోలు చేసి 2021లో తన నివాసంగా మార్చుకున్నారు. ప్రస్తుతం 6 బెడ్రూమ్లు, 12 బాత్రూమ్లు, స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్, గౌర్మెట్ కిచెన్ సహా అనేక అవుట్డోర్ సీటింగ్ ప్రాంతాలను కలిగి ఉన్న గ్రాండ్ U- ఆకారపు ఆస్తి $19 మిలియన్లకు మార్కెట్లో ఉంది.
అంతే కాదు.. ఈ ఇంటి గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయి! ఇది ఒకరిద్దరు సంగీత విద్వాంసుల పూర్వపు ఇల్లు కాబట్టి జిమ్ , ఆవిరి స్నాన సదుపాయాలతో కాకుండా గాత్ర బూత్ , రికార్డింగ్ స్టూడియోను కూడా కలిగి ఉంది. అత్యాధునిక హోమ్ థియేటర్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. జో జోనాస్ - సోఫీ టర్నర్ మొదటిసారిగా ఇంటిని మార్కెట్లో ఉంచినప్పుడు ఇది చాలా చర్చనీయాంశమైంది. అయితే జో - సోఫీ జంటకు ఇతర నగరాల్లోను సొంత ఇల్లు ఉన్నాయి. ఫ్లోరిడాలోని మయామిలో $11 మిలియన్ల ఖరీదైన భవనాన్ని గతంలో కొనుగోలు చేశారు. అయితే జో గత సంవత్సరం సెప్టెంబర్లో విడాకుల కోసం దాఖలు చేయడానికి ముందు ఈ ఇల్లు కూడా మార్కెట్లో అమ్మకానికి వచ్చింది.
గాయకుడు జో జోనాస్ తమ వివాహాన్ని 'కోలుకోలేని బ్రేకప్' అని వ్యాఖ్యానించాడు.. సోఫీ- జో మరుసటి రోజు వారి కస్టడీ యుద్ధం అసహ్యకరమైనదిగా మారడానికి ముందు తాము విడిపోతున్నామని ఉమ్మడి ప్రకటనను షేర్ చేసారు. ప్రస్తుతం ముగ్గురు ప్రముఖుల తర్వాత నాగరిక కాలిఫోర్నియా ఆస్తిని ఎవరు కొనుగోలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.