గాయనితో భర్త విడాకులు కోరుకోవడం లేదా?
అయితే తన విడాకుల కేసును కొట్టివేయాలని జో నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది అంటూ హాలీవుడ్ మీడియా తాజాగా కథనాలు వెలువరించింది.
By: Tupaki Desk | 27 Oct 2023 5:19 AM GMTప్రియాంక చోప్రా బంధువు, ప్రముఖ గాయకుడు జో జోనాస్ అతడి భార్య సోఫీ టర్నర్ తో బ్రేకప్ గురించి తెలిసిందే. అయితే ఇరువురు తమ పిల్లల సంరక్షణకు సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చిన కొద్ది రోజులకే, వారి విడాకుల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. జో జోనాస్ కొంత ఆలస్యంగా అయినా సోఫీ టర్నర్‌తో విడాకుల కేసును తిరస్కరించారని కూడా కథనాలొస్తున్నాయి.
మయామిలో జో జోనాస్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తన విడాకుల కేసును కొట్టివేయాలని జో నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది అంటూ హాలీవుడ్ మీడియా తాజాగా కథనాలు వెలువరించింది. కోర్టు వ్యవస్థలో కాకుండా భార్యతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే విధానాన్ని జో ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలు కేవలం పిల్లల కస్టడీ ఏర్పాట్లను పరిష్కరించడం కంటే నాలుగు రోజుల మధ్యవర్తిత్వ వ్యవధి కావాలని కోరుకున్నట్టు తెలిసింది. విడాకులతో సంబంధం ఉన్న పార్టీలు 'వివిధ ఒప్పందాల'కు అంగీకరించే దశకు చేరుకున్నాయని, చేతిలో ఉన్న అన్ని విషయాల కోసం ఒక సామరస్యపూర్వక పరిష్కారాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు కోర్టు పత్రాల్లో పేజీ 6లో పొందుపర్చిన విషయాలు వెల్లడిస్తున్నాయి.
పిల్లల కస్టడీ ఒప్పందాన్ని బహిరంగపరచిన మరుసటి రోజు 'పేజ్ సిక్స్'కు అందించిన సంయుక్త ప్రకటనలో సోఫీ టర్నర్ - జోనాస్ తమ పిల్లలను సహ-తల్లిదండ్రులుగా కొనసాగడంలో తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. విజయవంతమైన మధ్యవర్తిత్వం తర్వాత, పిల్లల కోసం ఇరువురూ సమానంగా సమయాన్ని వెచ్చించేందుకు అంగీకరించినట్టు తెలిసింది. U.S - U.K రెండు చోట్లా తమ ఇండ్లలో గొప్ప సహ-తల్లిదండ్రులుగా ఉండటానికి ఎదురుచూస్తున్నాము.. అని పేర్కొన్నట్టు తెలుస్తోంది. జో జోనాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన సత్ సందేశాన్ని కూడా ఇచ్చారు. నేను సరైన స్థలంలో ఉన్నాను.. సరైన సమయంలో.. సరైన పని చేస్తున్నాను! అని జో జోనాస్ ఇన్ స్టాలో రాసాడు.
నాలుగు సంవత్సరాల కాపురంలో ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . మూడేళ్ల విల్లా, 1 సంవత్సరం కిడ్ డెల్ఫిన్ ఈ దంపతులకు ఉన్నారు. జో జోనాస్ గత నెలలో మయామిలో విడాకుల కోసం దాఖలు చేశారు. సోఫీ టర్నర్ మీడియా ద్వారా దాని గురించి తెలుసుకున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అయితే విడిపోవాలనుకున్న భర్తపై సోఫీ కోర్టుకెక్కింది. వారి కుమార్తెల కోసం "వెంటనే కాపురానికి తిరిగి రావాలని" దావా వేయడం ద్వారా ప్రతిస్పందించింది. U.K. కోర్టులో తాను కూడా విడాకుల పిటిషన్ వేసింది. అయితే ఇటీవలి పరిణామాలను బట్టి ఈ U.K. పిటిషన్ స్థితి అనిశ్చితంగా ఉంది.