ఇద్దరు గజదొంగ హీరోలు స్కూల్ క్లాస్‌మేట్స్
ప్రస్తుతం కండల హీరో జాన్ అబ్రహాం తన సినిమా `డిప్లొమాట్`ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు స్కూల్ క్లాస్ మేట్ హృతిక్ రోషన్ గురించి ప్రస్థావించాడు.
By: Tupaki Desk | 21 March 2025 1:45 AMప్రస్తుతం కండల హీరో జాన్ అబ్రహాం తన సినిమా `డిప్లొమాట్`ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు స్కూల్ క్లాస్ మేట్ హృతిక్ రోషన్ గురించి ప్రస్థావించాడు. తాను స్కూల్ గ్రౌండ్ లో ఫుట్ బాల్ ఆడుతూ గోధుమ రంగుకు మారేవాడిని అని, అదే సమయంలో హృతిక్ అద్భుత డ్యాన్సులతో అదరగొట్టేవాడని జాన్ గుర్తు చేసుకున్నాడు. అతడి డ్యాన్సులు చూడటానికి మాత్రమే స్కూల్ ఈవెంట్లకు వెళ్లేవాళ్లం అని కూడా అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో జాన్ తన స్కూల్ డేస్ గురించి మాట్లాడాడు. బాంబే స్కాటిష్ స్కూల్‌లో హృతిక్ రోషన్, తాను క్లాస్‌మేట్స్ అని వెల్లడించాడు. ఒక పాత తరగతి గది ఫోటోకి స్పందించిన జాన్ అబ్రహాం, హృతిక్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి ఎక్కువగా మాట్లాడాడు. తన క్లాస్‌మేట్ హృతిక్ ప్రతిభను కొనియాడాడు.
హృతిక్ మనం తరంలో అత్యుత్తమ డ్యాన్సర్.. స్కూల్లో కూడా అతడు బ్రేక్‌డాన్సుల్లో అదరగొట్టేవాడు. మాకు స్కూల్లో సాంస్కృతిక కార్యకలాపాల పీరియడ్ ఉండేది.. మేమంతా హృతిక్ డ్యాన్స్ చూడటానికి మాత్రమే వెళ్ళేవాళ్ళం. అతను ఎంత గొప్ప డ్యాన్సర్`` అంటూ పొగిడేసాడు. నేను ఫుట్‌బాల్ మైదానంలో గోధుమ రంగులోకి మారుతూ నా సమయాన్ని వృధా చేసుకునేవాడిని.. అతడు అందంగా నృత్యం చేసేవాడు! అని తెలిపాడు.
జాన్ - హృతిక్ ఈ ఇద్దరికీ కామన్ కనెక్షన్ ధూమ్ ఫ్రాంఛైజీ. ఇద్దరూ ధూమ్ ఫిల్మ్ సిరీస్‌లో యాంటీ-హీరోలుగా నటించారు. పార్ట్ 1లో జాన్ అబ్రహాం విలన్ గా నటించగా, పార్ట్ 2లో హృతిక్ నెగెటివ్ షేడ్ ఉన్న గజదొంగ పాత్రను పోషించాడు. కానీ ఆ ఇద్దరూ ఎప్పుడూ కలిసి పని చేయలేదు. ఆ ఇరువురూ వై.ఆర్.ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రాలలో కూడా కనిపించారు.. కానీ విడివిడిగా కనిపించారు. ఇంటర్వ్యూలో దీనిని కూడా జాన్ ప్రస్తావించాడు. తన పాత్ర జిమ్ .. హృతిక్ కబీర్ మధ్య ఆన్-స్క్రీన్ యూనియన్ ఎలా ఉంటుందో చూడాలని అతడు ఆలోచిస్తున్నాడు.
హృతిక్ `కహో నా ప్యార్ హై` చిత్రంతో తెరంగేట్రం చేశాడు. తన తరంలోనే అతిపెద్ద స్టార్‌గా ఎదిగాడు. అతడి తెరంగేట్రానికి ముందు, తన తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్‌కు `కరణ్ అర్జున్` చిత్రంలో సహాయకుడిగా పనిచేశాడు. తదుపరి `వార్ 2`లో ఎన్టీఆర్ తో కలిసి హృతిక్ నటిస్తున్నాడు. ప్రస్తుతం జాన్ `ది డిప్లొమాట్`ను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రం నేటికి బాక్సాఫీస్ వద్ద రూ. 21 కోట్లు వసూలు చేసింది.