గుర్తింపు కోసం పోరు అతి భయంకరంగా!
అయితే అలాంటి సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటానంటూ షాక్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
By: Tupaki Desk | 13 March 2025 4:00 PM ISTసెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఉదయం లేచి ఏ పని చేసినా? ఆ పని మరు నిమిషం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. అవసరం అనుకుంటే లైవ్ లోనే ఆ పనులు చూపిస్తుంటారు. ఇక ప్రచారం పరంగా సోషల్ మీడియా విని యోగం అన్నది పీక్స్ లో ఉంది. అందులో సెలబ్రిటీలు, సినిమా వాళ్లు తమ సినిమాల ప్రచారం కోసం సోషల్ మీడియా అన్నది అతిముఖ్యమైన సాధనంగా మార్చేసుకున్నారు.
సినిమా మొదలైన దగ్గర నుంచి రిలీజ్ వరకూ ప్రతీ విషయం సోషల్ మీడియాలో ఉంటుంది. ఇంకా వ్యక్తిగత ప్రచారం కోసం సోషల్ మీడియా మాధ్యమాన్ని అదే తీరున వినియోగిస్తున్న వాళ్లు ఎంతో మంది. అయితే అలాంటి సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటానంటూ షాక్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. తన సినిమాల ప్రచారం కోసం సోషల్ మీడియాను చాలా తక్కువగా వినియోగిస్తాడట.
ప్రస్తుతం ప్రజలు ఎదుర్కోంటున్న పెద్ద సమస్యల్లో గుర్తింపు ఒకటన్నారు. తెలియని వ్యక్తుల నుంచి గుర్తింపు కోరుకుంటున్నారన్నారు. 'అది చాలా భయంకరంగా మారింది. రోజు మనం ఏం చేసినా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాని ఆధారంగా ఎదుట వారి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. నా దృష్టిలో అది అంత అవసరమైన విషయం కాదు. ఏది ముఖ్యమో ...ఏది కాదో అందరూ అర్దం చేసుకోవాలి.
సినిమాల్లో ఉన్న వాళ్లకు కూడా ఇదే వర్తిస్తుంది. నేను ఎన్నో సంతవ్సరాలుగా ఇలాగే ఉన్నాన్నారు. ప్రస్తుతం జాన్ అబ్రహం 'ది డిప్లోమాట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ఇది భారీ యాక్షన ఎంటర్ టైనర్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈసారి జాన్ భాయ్ హిట్ కొట్టడం ఖాయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఇప్పటికే వైరల్ గా మారాయి.