ప్రతి మనిషి కఠినమైన విధిని ఎదుర్కోవాలన్న పాపులర్ నటుడు
ఈవెంట్ సందర్భంగా తన సినిమా గురించి అలాగే మాజీ భార్య అంబర్ హర్డ్‌తో అత్యంత పాపులరైన కోర్టు రూమ్ డ్రామా గురించి కూడా మాట్లాడాడు.
By: Tupaki Desk | 26 Sep 2024 3:00 AM GMTస్పెయిన్‌లో జరుగుతున్న 72వ శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు, ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన కొత్త చిత్రం ``మోడీ: త్రీ డేస్ ఆన్ ది వింగ్ ఆఫ్ మ్యాడ్‌నెస్``ను ప్రారంభించారు. ఇది అతడు దర్శకత్వం వహిస్తున్న సకొత్త చిత్రం. ఈవెంట్ సందర్భంగా తన సినిమా గురించి అలాగే మాజీ భార్య అంబర్ హర్డ్‌తో అత్యంత పాపులరైన కోర్టు రూమ్ డ్రామా గురించి కూడా మాట్లాడాడు.
మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ జీవితాల్లో కష్ట కాలాన్ని ఎదుర్కొన్నారని `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` నటుడు జానీ డెప్ అన్నారు. అంతిమంగా మనమంతా అనేక పరిస్థితులను ఎదుర్కొన్నాం.. ప్రతి ఒక్కరికి ఎవరి కథ వారికి ఉంది. కచ్చితంగా నేను ఇక్కడ అక్కడ అనేక విషయాలను ఎదుర్కొన్నాను. కానీ మీకు తెలుసా.. నేను బాగానే ఉన్నాను! అని అతడు అన్నాడు. ఇది టెలివిజన్‌లో ప్రసారం చేసిన సోప్ ఒపెరాగా మారింది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక కఠినమైన సమస్యను ఎదుర్కొంటారని, అలాగే జీవించడానికి, గుర్తుంచుకోవడానికి , భవిష్యత్తులో వాటిని ఒక పాఠంగా ఉపయోగించుకోవడానికి మనకు ఆ జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయని జానీ డెప్ అన్నారు.. ఇవేవీ మర్చిపోలేనివి అని కూడా అన్నాడు.
అతడి మాటలను బట్టి మాజీ భార్య అంబర్ హర్డ్ పై పోరాడిన కోర్టు కేసు గురించి అని అర్థమవుతోంది. జానీ డెప్ ఆ కేసులో తన భార్యపై పూర్తిగా పై చేయి సాధించాడు. తనను తాను నిరపరాధి అని నిరూపించి చూపించాడు. ఆసక్తికరంగా.. జానీ డెప్- అంబర్ హర్డ్ మధ్య వివాదాన్ని బుల్లితెర కోసం లైవ్ గా షూట్ చేసారు. `2022 వర్జీనియా పరువు నష్టం విచారణ` టెలివిజన్ లో వేసారు. దాని ప్రొసీడింగ్స్ ప్రతిరోజూ మిలియన్ల మందికి ప్రత్యక్ష ప్రసారం చేసారు.
డెప్ న్యాయవాదులలో ఒకరైన కామిల్లె వాస్క్వెజ్ ప్రకారం.. విచారణ సమయంలో కోర్టు గదిలో కెమెరాలను అభ్యర్థించాడు డెప్. ఎందుకంటే డెప్ తన అభిమానులకు జవాబుదారీగా ఉండటం , కేసు సందర్భంగా మాట్లాడుతున్న లైవ్ సాక్ష్యాలను వారికి చూపించడం చాలా ముఖ్యం. కానీ అంబర్ హర్డ్ మాజీ న్యాయవాది, ఎలైన్ చార్ల్‌సన్ బ్రెడ్‌హాఫ్ట్, కోర్టు గదిలో కెమెరాలను అనుమతించడానికి వ్యతిరేకంగా పోరాడారు. డెప్ చిత్రం `మోడీ` 1916 పారిస్‌లో జరిగిన యుద్ధంలో కళాకారుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.