బెయిల్ రద్దు చేయండి అంటూ జానీ మాస్టర్ మెమో!
కానీ ఇంతలోనే అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటన రావడంతో? బెయిల్ విషయంలో కూడా జానీ వెనక్కి తగ్గారు.
By: Tupaki Desk | 8 Oct 2024 9:39 AM GMTపోక్సో చట్టం కింద కేసు నమోదైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ అవార్డు రద్దు కావాడంతో మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అవార్డు రద్దు కావడంతో మధ్యంతర బెయిల్ తీసుకోబోనంటూ జానీ మాస్టర్ కూడా కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ కొన్ని రోజులుగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యురాలు లైంగికంగా వేధించాడని కేసు పెట్టడంతో జానీ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జైలుకు తరలిం చడం.. కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. అయితే జానీకి జాతీయ అవార్డు తీసుకునేందుకు బెయిల్ కావాలం టూ పిటీషన్ వేసుకోవడంతో మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ ఇంతలోనే అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటన రావడంతో? బెయిల్ విషయంలో కూడా జానీ వెనక్కి తగ్గారు.
పోలీసులతో పాటు జానీ మాస్టర్ కూడా బెయిల్ రద్దు చేయండని కోరడంతో? పోలీసులు పిటీషన్ దాఖలు చేసి ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడిని పోలీసులు విచారించడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే జానీ మాస్టర్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఈ క్రమంలో అతడిని నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతితో తీసుకోవడం జరిగింది.
మరోవైపు జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే కేసులో ఇరిక్కిస్తున్నానరి ఆయన భార్య ఆరోపించిన సంగతి తెలిసిందే. కేసు రుజువైతే జానీ మాస్టర్ ని వదిలేస్తానని కూడా సవాల్ విసిరారు. బాధితురాలిని జానీ భార్య కూడా హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.