Begin typing your search above and press return to search.

జానీ మాస్టార్ బెయిల్ ర‌ద్దు.. కోర్టుకు పోలీసులు

ఒక‌వేళ బెయిల్ ర‌ద్ద‌యితే తిరిగి జానీ మాస్టార్ ని పోలీసులు రిమాండ్ లోకి తర‌లిస్తార‌ని చెబుతున్నారు. రిమాండ్ లో విచార‌ణ ఇంకా పూర్తి కావాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 3:42 AM GMT
జానీ మాస్టార్ బెయిల్ ర‌ద్దు.. కోర్టుకు పోలీసులు
X

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ కోర్టు నుంచి బెయిల్ మంజూరు కాలేదు. ఇటీవ‌ల జాతీయ అవార్డ్ అందుకునేందుకు రాజ‌ధాని దిల్లీకి వెళ్లాల్సి ఉండ‌గా, నాలుగు రోజులు బ‌య‌ట ఉండేందుకు మ‌ధ్యంత‌ర‌ బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టు అనుమ‌తినిచ్చింది. కానీ ఇంత‌లోనే ప‌రిస్థితులు జానీ మాస్టార్ కి వ్య‌తిరేకంగా మారాయి. జాతీయ అవార్డుల క‌మిటీ (జూరీ) అత‌డి అవార్డును ర‌ద్దు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌ర్తిస్తుందా లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది.

ప్ర‌స్తుతం జానీ మాస్టార్ బెయిల్ ర‌ద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్ర‌యించ‌నున్నార‌ని తెలిసింది. కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాల్సి ఉంది. ఒక‌వేళ బెయిల్ ర‌ద్ద‌యితే తిరిగి జానీ మాస్టార్ ని పోలీసులు రిమాండ్ లోకి తర‌లిస్తార‌ని చెబుతున్నారు. రిమాండ్ లో విచార‌ణ ఇంకా పూర్తి కావాల్సి ఉంటుంది.

కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే.. 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ త‌న‌పై జానీ మాస్టార్ చాలా కాలంగా లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ఇది సంచ‌ల‌న‌మైంది. ఫిర్యాదు అనంత‌రం.. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాపై పోలీసులు జీరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసారు. 21 ఏళ్ల మహిళ కూడా కొరియోగ్రాఫర్ తాను మైన‌ర్ గా ఉన్న‌ప్పుడే జానీ మాస్టార్ వేధింపులు ప్రారంభించార‌ని పోలీసులకు ఫిర్యాదులో తెలిపింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, గత కొన్ని నెలలుగా జానీ మాస్టర్‌తో సన్నిహితంగా పనిచేస్తున్న మహిళ నుంచి వేధింపులు ఎదుర‌య్యాయ‌ని, వారి అవుట్‌డోర్ షూట్‌లలో జానీ మాస్టార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొంది.

అంతేకాదు.. తన ఇంట్లో జానీ మాస్టర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆ యువ‌తి ఆరోపించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో షూట్ చేస్తున్నప్పుడు జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదుదారు తెలిపారు. నార్సింగిలోని తన నివాసంలో అతను తనపై చాలాసార్లు వేధింపుల‌కు పాల్ప‌డ్డాడని కూడా ఆమె పేర్కొంది... మహిళ నార్సింగి నివాసి కాబట్టి, కేసు అక్కడి పోలీసులకు బదిలీ చేయ‌గా తదుపరి విచారణ అక్క‌డ మొద‌లైంది. కానీ ఈ కేసులో ఆ యువ‌తికి వ్య‌తిరేకంగా జానీ మాస్టార్ భార్య కౌంట‌ర్ దాఖ‌లు చేసారు. ఆ యువ‌తి ప్ర‌వ‌ర్త‌న త‌ప్పుడుగా ఉంద‌ని, త‌న భ‌ర్త‌ను పెళ్లాడేందుకు వేధించింద‌ని ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తూ కౌంట‌ర్ దాఖ‌లు చేసారు. ఈ కేసులో నిజానిజాలేమిట‌న్న‌ది పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవ‌ల రిమాండ్ లో జానీ మాస్ట‌ర్ స‌ద‌రు యువ‌తిపైనే ప్ర‌త్యారోప‌ణ‌లు చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి.

జానీ మాస్టర్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) , స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మార్గనిర్దేశం చేసేందుకు సినీ ప్రముఖులు తనను సంప్రదించారని మహిళా భద్రతా విభాగం (డబ్ల్యూఎస్‌డబ్ల్యూ) తెలంగాణ డీజీ శిఖా గోయల్ తెలిపారు.