Begin typing your search above and press return to search.

20ఏళ్ల న‌టితో డేటింగ్ మొద‌లు పెట్టిన స్టార్ హీరో

పాపుల‌ర్ హాలీవుడ్ హీరో జానీడెప్ త‌న భార్య‌తో ప‌రువు న‌ష్టం కేసులో సుదీర్ఘ పోరాటంలో అజేయుడిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Sep 2023 3:45 AM GMT
20ఏళ్ల న‌టితో డేటింగ్ మొద‌లు పెట్టిన స్టార్ హీరో
X

పాపుల‌ర్ హాలీవుడ్ హీరో జానీడెప్ త‌న భార్య‌తో ప‌రువు న‌ష్టం కేసులో సుదీర్ఘ పోరాటంలో అజేయుడిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. కోర్టు అత‌డికి భారీ మొత్తాన్ని చెల్లించాల‌ని అత‌డి భార్య అంబ‌ర్ట్ ని ఆదేశించింది. ఈ విజ‌యానికి జానీ డెప్ ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్ చేసుకున్నారు. కోర్టు గొడ‌వ‌ల్లో మాజీ భార్య‌పై విజ‌యం అనంత‌రం జానీ డెప్ మ‌రో యువ‌న‌టితో ప్రేమాయ‌ణం ప్రారంభించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ది వెడ్నెస్ డే స్టార్ జెన్నా ఒర్టెగాతో జానీ డెప్ డేటింగ్ చేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. 20 ఏళ్ల అంద‌మైన క‌థానాయిక‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. ఓ వెబ్ సిరీస్ సెట్‌లో ఉన్న జెన్నా ఒర్టెగా 60 ఏళ్ల వయస్కుడైన‌ జానీ డెప్‌తో ప్రేమలో పడింద‌ని పుకార్లు గుప్పుమ‌న్నాయి. ఆ ఇద్ద‌రినీ కలిసి చూడాలని అభిమానులు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. `బీటిల్ జూయిస్ 2` రూపంలో ఆ ఇద్ద‌రికీ క‌లిసి న‌టించే అవ‌కాశం ద‌క్కింది.

తాజాగా ఈ పుకార్ల‌పై జెన్నా ఒర్టెగా క‌ల‌త చెందింద‌ని, ఇన్‌స్టాగ్రామ్ లో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ``ఇది చాలా హాస్యాస్పదం.. నేను నవ్వలేను`` అంటూ జెన్నా వ్యాఖ్యానించింది. ఇవ‌న్నీ నిరాధారమైన వార్త‌లు.. ఊహాగానాలు మాత్ర‌మేన‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. నేను నా జీవితంలో జానీ డెప్‌ను ఎప్పుడూ కలవలేదు.. క‌నీసం కలిసి పని చేయలేదు. దయచేసి అసత్యాలు ప్రచారం చేయడం మానేసి మమ్మల్ని వదిలేయండి. నిరాధార ఆరోపణల తుఫాను నుండి ఉపశమనం కోసం ఒక విన్నపమిది.. అని వ్యాఖ్యానించింది.

ప్రతిస్పందనగా జానీ డెప్ ప్రతినిధి ఊహాగానాలకు తెర‌దించుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇవ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లు అంటూ ఖండించారు. డెప్ -ఒర్టెగాలను కలిపే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన థ్రెడ్ ఏదీ లేదని స్పష్టం చేశారు. శ్రీమతి ఒర్టెగాతో డెప్‌కు వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధం లేదు. అతను ఆమెను ఎప్పుడూ కలవలేదు లేదా ఆమెతో మాట్లాడలేదు. అతను ఆమెతో ఏ ప్రాజెక్ట్‌లోను చేర‌లేదు. ఇద్దరు నటుల మధ్య ఎటువంటి సంబంధం లేద‌ని నొక్కిచెప్పే ఒక నిశ్చయమైన ప్రకటన ఇది. డెప్ కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌ను, అత‌డి వృత్తిని దెబ్బతీయాలనే వారి ఉద్దేశాన్ని ప్ర‌తినిధి హైలైట్ చేశాడు.