Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు.. ఏం జరిగింది?

జానీ మాస్టర్ పై ఆరోపనలు చేసిన మహిళ ముంబై లో ఉంటున్నట్లు సమాచారం. ఆమె నార్త్ ఇండియాకి చెందిన మహిళ అనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Sep 2024 5:02 AM GMT
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు.. ఏం జరిగింది?
X

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ఆయన తమిళ్ మూవీ ‘తిరు’కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలకి ఆయన ఎక్కువగా పని చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.

రెగ్యులర్ గా జనసేన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లైంగికంగా వేదించినట్లు పిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. జానీ మాస్టర్ దగ్గర పని చేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ అతనిపై ఫిర్యాదు చేసినట్లు మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది. తనపై పలు మార్లు జానీ మాస్టర్ అత్యాచారం చేసాడని ఆరోపణలు చేస్తూ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అవుట్ డోర్స్ షూటింగ్స్ కోసం జానీ మాస్టర్ తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై వెళ్లే సమయంలో లైంగికంగా వేధించినట్లు మహిళ ఫిర్యాదు చేసిందంట. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. జానీ మాస్టర్ పై ఆరోపనలు చేసిన మహిళ ముంబై లో ఉంటున్నట్లు సమాచారం. ఆమె నార్త్ ఇండియాకి చెందిన మహిళ అనే మాట వినిపిస్తోంది.

జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫిర్యాదు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసుని ముంబైకి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ పై 376తో మరికొన్ని సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2017లో జానీ మాస్టర్ పై ఓ కేసు నమోదు అయ్యిందంట. ఈ కేసులో అతనికి ఆరునెలల జైలుశిక్ష కూడా పడిందనే మాట వినిపిస్తోంది.

జానీ మాస్టర్ గతంలో చాలా వివాదాలలో ఇరుక్కున్నారంట. అయితే జనసేన పార్టీతో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. ఆయనపై వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు సడెన్ గా లైంగిక ఆరోపణలతో కేసు నమోదు అయ్యింది. దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.